2018 ఇయర్ ఎండ్ సేల్ : కార్లపై భారీ డిస్కౌంట్

ఇయర్ ఎండ్ సేల్ పుణ్యమా అని కార్ కొనుక్కుందామని ఎదురుచూస్తున్న వారి కోసం భారీ ఆఫర్లు కుమ్మరిస్తున్నారు కార్ డీలర్లు.

ఇయర్ ఎండ్ సేల్ పుణ్యమా అని కార్ కొనుక్కుందామని ఎదురుచూస్తున్న వారి కోసం భారీ ఆఫర్లు కుమ్మరిస్తున్నారు కార్ డీలర్లు.

ఇయర్ ఎండ్ సేల్ పుణ్యమా అని కార్ కొనుక్కుందామని ఎదురుచూస్తున్న వారి కోసం భారీ ఆఫర్లు కుమ్మరిస్తున్నారు కార్ డీలర్లు. యావత్ దేశవ్యాప్తంగా మార్చి 2019 కల్లా కార్లు అమ్మేయాలని బంపర్ ఆపర్లు ప్రకటిస్తున్నారు. భారత్‌లో కార్ల అమ్మకాల్లో నెంబర్ వన్ గా దూసుకుపోతున్న మారుతీ సుజుకీ ధీటుగా ఇగ్నిస్, ఆల్టో, స్విఫ్ట్, సియాజ్, హ్యుండాయ్‌లు ఏ మాత్రం తీసిపోకుండా భారీగా డిస్కౌంట్లతో ఎదురుచూస్తున్నాయి. 
Also Read : ‘రియల్ కర్మ్ యోగి’లకు.. మోడీ రూ.21 లక్షల విరాళం

గతేడాదితో పోలిస్తే కంపెనీల వారీగా కార్ల డిస్కౌంట్‌లు ఇలా ఉన్నాయి.

మారుతీ సుజుకీ డిస్కౌంట్లు :
ఈ నెలలో మారుతీ సుజుకీ కార్ కొందామనుకుంటే మాత్రం మీరు లక్ష రూపాయలు ఆదా చేసుకున్నట్లే. 2018 మోడళ్లు భారీ డిస్కౌంట్లు మన ముందుంచనున్నాయి. ఇందులో హైలెట్‌గా 2018 ఇగ్నిస్ మోడల్‌కు రూ.1.10 లక్షల డిస్కౌంట్ రానుంది. 

హ్యుండాయ్ కార్ డిస్కౌంట్లు :
మార్చి 2019లో హ్యుండాయ్ కార్ తీసుకుంటే రూ.90వేల వరకూ లాభం పొందొచ్చు. హ్యుండాయ్ ఎక్సెంట్ మీద గరిష్ఠంగా రూ.40వేల వరకూ డిస్కౌంట్ వస్తుంది. హ్యుండాయ్ గ్రాండ్ అయితే రూ.45వేల డిస్కౌంట్ ఇస్తుండటంతో పాటు రూ.25వేల ఎక్స్ చేంజ్ బోనస్ తో పాటు అదనపు బెనిఫిట్ లుగా ప్రభుత్వ ఉద్యోగులకు రూ.5100 లాభం పొందొచ్చు. 

హోండా కార్ డిస్కౌంట్లు : 
హోండా కార్లకు డిస్కౌంట్ లేకపోయినా ఎక్స్‌చేంజ్ బోనస్ మాత్రం భారీగానే ఉండనుంది. ఇందులో గరిష్టంగా హోండా బీఆర్-వీకి రూ.50వేలు తగ్గింపు వస్తుంది. మరో వైపు 2018 హోండా అమేజ్ కు రూ.25వేల ఎక్స్ చేంజ్ బోన్స్ బెనిఫిట్ గా మారనుంది. 
Also Read : వన్ ఢిల్లీ.. వన్ రైడ్ : మెట్రో, బస్సు జర్నీ ఈజీ

మహీంద్రా కార్ డిస్కౌంట్లు :
మహీంద్రా కేయూవీ 100 రూ.70వేల డిస్కౌంట్ వర్తించనుంది. దాంతో పాటు రూ.30వేల ఎక్స్ చేంజ్ బోనస్ కూడా వర్తించనుంది. కొత్తగా లాంచ్ చేసిన మారాజ్జో కారుకు కూడా ఎక్స్ చేంజ్ బోనస్ గారూ. 20వేలు ప్రకటించింది.  

టయోటా కార్ డిస్కౌంట్లు :
టయోటా కార్ డిస్కౌంట్లు భారీగా తగ్గించడంతో రూ.2లక్షల వరకూ లాభం పొందొచ్చు. సెడాన్ కారుకు ఎక్స్ చేంజ్ బోనస్ గా రూ. 20వేలు ఇవ్వనున్నారు. కార్పొరేట్ ఎంప్లాయీస్ కు అదనంగా మరో రూ.30వేల డిస్కౌంట్ కూడా ఇస్తారు. 

ఫోర్డ్ కారు డిస్కౌంట్లు : 
దేశవ్యాప్తంగా మార్చి నెలలో ఫోర్డ్ కారు డీలర్లు ఎట్రాక్టివ్ డీల్ ఆఫర్లు అందిస్తున్నారు. మూడు ఫోర్డ్ కార్లపై రూ.45వేల వరకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు. అందులో అస్పైర్, ఫ్రీ స్టయిల్, ఎకో స్పోర్ట్ కార్లు ఉన్నాయి. ఈ కార్లకు క్యాష్ డిస్కౌంట్ రూ.25వేలు ఉండగా, ఎక్సేంజ్ బోనస్ రూ.20వేల వరకు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫోర్డ్ ఫిగో, ఎండేవర్ కార్లపై మాత్రం మార్చి నెలలో ఎలాంటి డిస్కౌంట్లు ఆఫర్ వర్తించవు. 

టాటా కారు డిస్కౌంట్లు : 
మార్చి నెలలో TATA మోటార్స్ కార్లు ఎట్రాక్టివ్ డీల్స్ తో ఆఫర్లు అందిస్తోంది. టైయాగో కారు ప్లాట్ డిస్కౌంట్ పై రూ.60వేల వరకు అందిస్తోంది. పాపులర్ SUV నెక్సాన్ కారుపై ప్లాట్ డిస్కౌంట్ ఈ నెలాఖరులోపు రూ.74వేలతో సొంతం చేసుకోవచ్చు. టాటా టైగర్ డీలర్ షిప్ కూడా ప్లాట్ డిస్కౌంట్ రూ.1.04 లక్షలతో అందుబాటులో ఉంది. ఇందులో హెక్సా ప్లాట్ డిస్కౌంట్ కనీసం రూ. 1.05 లక్షలు సగానికి తక్కువగా ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ మీకు నచ్చితే ఇదే ధరకు హెక్సా కారును సొంతం చేసుకోవచ్చు.  
Also Read : తెలంగాణలో డ్రోన్‌ అంబులెన్స్: యాక్సిడెంట్లే టార్గెట్

నిస్సాన్ కార్ డిస్కౌంట్లు : 
మార్చి 2019లో ఇండియా వ్యాప్తంగా నిస్సాన్ కార్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు సంస్థ డీలర్లు. ఇందులో మైక్రా, సన్నీ రెండు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఆటోమాటిక్ వేరియంట్లతో కూడిన రెండు మోడళ్లపై మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తించనుంది. నిస్సాన్ మైక్రా కారు.. ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ తో రూ. 1 లక్ష కే అందుబాటులో ఉంది. సన్నీ కారు మోడల్ కొనుగోలుపై రూ.1.28 లక్షలు ఆదా చేసుకోవచ్చు. ఈ బంఫర్ డిస్కౌంట్ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే డీలర్లు ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండు మోడల్ కార్లను సొంతం చేసుకోవాలంటే ఇదే సరైన సమయం.. త్వరపడండి. 

వోక్స్ వాగెన్ కారు డిస్కౌంట్లు : 
వోక్స్ వాగెన్ కార్లపై డీలర్లు రూ. 1.5 లక్షల భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. మార్చిలో వోక్స్ వాగెన్ కార్లు కొనుగోలు చేసినవారికి ఈ ఆఫర్ డిస్కౌంట్ వర్తించనుంది. కంపెనీ ప్రారంభ ఆఫర్ డిస్కౌంట్ రూ. 90వేలు వరకు ఉంది. 2018 మోడల్ కార్లు పోలో, అమియో కార్లపై 90వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. మరో మోడల్ కారు వింటో రూ.1.35 లక్షలకే ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అది కూడా మార్చి నెలలోనే కొనుగోలు చేస్తేనే డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ మూడు కార్లను ఎక్సేంజ్ బోనస్ పై రూ.25వేల వరకు ఆఫర్ ఇస్తుంది. 2019 మోడల్ వింటో కారును కొనుగోలు చేయాలనకుంటే మాత్రం కనీసం డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. 

రెనాల్ట్ కారు డిస్కౌంట్లు : 
రెనాల్ట్ కారు డీలర్లు కూడా మార్చి నెలలో ఇయర్ ఎండ్ సేల్స్ లో భాగంగా డిసెంట్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో కనీసం డిస్కౌంట్ రూ.80వేల వరకు ఉంటుంది. కెప్తర్ కారు మోడల్ పై ఈ ఆఫర్ డిస్కౌంట్ వర్తించనుంది. అంతేకాదు.. లాడ్జీ, డస్టర్ మోడల్ కార్లు కొనుగోలు చేస్తే అదనంగా రూ.5వేలు డిస్కౌంట్ తో పాటు ఏడాది పాటు ఉచితంగా ఇన్యూరెన్స్ అందించనుంది. క్విడ్ కారు మోడల్ పై రూ.2వేల వరకు డిస్కౌంట్ అందించనుంది. రెనాల్ట్ డెస్టర్ కారు మోడల్ పై క్యాష్ డిస్కౌంట్లు లేవు. ఎక్సేంజ్ బోనస్ రూ.25వేల వరకు అందించనుంది. దీంతో పాటు రూ.5వేల కార్పొరేట్ డిస్కౌంట్ తో పాటు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఆఫర్ పొందొచ్చు. 
Also Read : పేరు చెప్పొద్దు.. ఆడి చూపించు : IPL 2019 సాంగ్ రిలీజ్

గమనిక: ఈ సమాచారమంతా వివిధ డీలర్ల నుంచి సేకరించింది. కాబట్టి ఒక్క డీలర్ రేట్లు సుమారుగా ఉంటాయే కానీ, సరిగ్గా అదే ధరను ఉంటాయని కాదు.