×
Ad

PF withdraw UPI : ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. ఇకపై UPI నుంచే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఎప్పటినుంచంటే?

PF withdraw UPI : అతి త్వరలో ఈపీఎఫ్ఓ ​​సభ్యులు యూపీఐ ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అనారోగ్యం, వివాహం లేదా ఇల్లు వంటి అవసరాలకు డబ్బులు తీసుకోవచ్చు.

PF withdraw UPI (Image Credit To Original Source)

  • ఏప్రిల్ 2026 నుంచి ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్
  • ఈపీఎఫ్ ఖాతాదారులు యూపీఐ నుంచి డబ్బులు డ్రా
  • ఆటో-సెటిల్మెంట్ లిమిట్ రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంపు

PF withdraw UPI : ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ న్యూస్.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 2026 నుంచి దాదాపు 80 మిలియన్ల మంది సభ్యులు యూపీఐ ద్వారా నేరుగా పీఎఫ్ అకౌంట్ల నుంచి నేరుగా డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. కొద్ది క్షణాల్లోనే యూపీఐ ద్వారా మీ డబ్బులు బ్యాంకు అకౌంటులో క్రెడిట్ అవుతాయి. ఇకపై క్లెయిమ్స్ విషయంలో ఆందోళన అవసరం ఉండదు. పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి..

కొత్త ఈపీఎఫ్ రూల్స్ ఏంటి? :
ఈపీఎఫ్ సభ్యులు యూపీఐ పిన్ ఉపయోగించి సేఫ్ విత్‌డ్రా చేయవచ్చు. అకౌంటులో కనీస బ్యాలెన్స్ తప్పనిసరి. మిగిలిన మొత్తం నేరుగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్లు, ఏటీఎంలు లేదా డెబిట్ కార్డుల ద్వారా డబ్బులు తీసుకోవచ్చు.

ప్రస్తుతం, క్లెయిమ్ దాఖలు చేశాక డబ్బులు వచ్చేవరకు 3 రోజుల సమయం పడుతుంది. ఇకపై యూపీఐ ద్వారా డబ్బులు ఈజీగా క్రెడిట్ అవుతాయి. ఈపీఎఫ్ఓ ​​ప్రతి ఏడాదిలో 50 మిలియన్లకు పైగా క్లెయిమ్‌లను అందుకుంటుంది. ఇందులో ఎక్కువ భాగం డబ్బులు విత్ డ్రా కోసమే వస్తున్నాయి.

ఆటో విత్‌డ్రా లిమిట్‌ పెంపు :

ఆటో-సెటిల్మెంట్ లిమిట్ రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెరిగింది. అనారోగ్యం, విద్య, వివాహం లేదా ఇంటి కొనుగోలు వంటి అవసరాలకు ఫండ్స్ 3 రోజుల్లో అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 2025లో సెంట్రల్ బోర్డ్ 13 సంక్లిష్ట పరిస్థితులను 3 కేటగిరీలుగా విభజించింది.

PF withdraw UPI  (Image Credit To Original Source)

ముఖ్యమైన అవసరాల్లో అనారోగ్యం , విద్య, వివాహం, గృహనిర్మాణం, ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు, 12 నెలల సర్వీసు తర్వాత అర్హత ఉన్న మొత్తంలో 100శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ, 8.25 శాతం వడ్డీ నుంచి ప్రయోజనం పొందాలంటే కనీసం 25శాతం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి.

Read Also : Hyundai Car Discounts : కొత్త కారు కొంటున్నారా? ఈ హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 80వేల వరకు ఆదా..!

కోవిడ్ నుంచి పెరిగిన యూపీఐ వినియోగం :
కోవిడ్ మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ ఆటో-సెటిల్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు యూపీఐ పేమెంట్లు కూడా బ్యాంకింగ్ మాదిరిగానే చాలా ఈజీగా మారిపోయాయి. సున్నా డాక్యుమెంటేషన్‌తో 100శాతం ఆటో-అప్రూవల్ ఆప్షన్ ఉంది. ఈపీఎఫ్ఓకి బ్యాంకింగ్ లైసెన్స్ లేదు. తద్వారా నేరుగా డబ్బులను విత్ డ్రా చేసుకోలేరు.

పీఎఫ్ ఖాతారులకు బెనిఫిట్స్ ఏంటి? :
ఈ EPFO ​​3.0 ఫీచర్ ద్వారా నిరుద్యోగం, విపత్తు లేదా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా ఆర్థిక సాయాన్ని పొందవచ్చు. అందుకే మీ ఆధార్, బ్యాంక్ వివరాలను సీడ్ చేయండి. పీఎఫ్ రూల్స్ తప్పక పాటించండి. మీ రిటైర్మెంట్ కార్పస్ ద్వారా భవిష్యత్తులో అనేక బెనిఫిట్స్ పొందవచ్చు.