Hyundai Car Discounts : కొత్త కారు కొంటున్నారా? ఈ హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 80వేల వరకు ఆదా..!

Hyundai Car Discounts : హ్యుందాయ్ కార్లపై అద్భుతమైన ఆఫర్లు.. రూ.80వేల వరకు డిస్కౌంట్లు, సేవింగ్స్ పొందవచ్చు. ఎక్స్‌టర్, వెర్నా, ఆరా గ్రాండ్ ఐ10 నియోస్‌తో సహా ఇతర మోడళ్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Hyundai Car Discounts : కొత్త కారు కొంటున్నారా? ఈ హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 80వేల వరకు ఆదా..!

Hyundai Car Discounts (Image Credit To Original Source)

Updated On : January 17, 2026 / 4:45 PM IST
  • 2026 జనవరిలో హ్యుందాయ్ కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లు
  • ఎక్స్‌టర్, వెర్నా, ఆరా గ్రాండ్ i10 నియోస్‌తో సహా ఇతర మోడళ్లు
  • ఎంట్రీ-లెవల్ SUV కేటగిరీలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు
  • ఎక్స్-షోరూమ్ ధరపై నేరుగా క్యాష్ డిస్కౌంట్

Hyundai Car Discounts : హ్యుందాయ్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. 2026 జనవరిలో అనేక హ్యుందాయ్ మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రవేశపెట్టింది. కస్టమర్ల కోసం ఏకంగా రూ. 80వేల వరకు డిస్కౌంట్లు, సేవింగ్స్ అందిస్తోంది. ఈ ఆఫర్లలో ఎక్స్‌టర్, వెర్నా, ఆరా గ్రాండ్ i10 నియోస్‌తో సహా ఎంపిక చేసిన మోడళ్లతో సహా అనేక రకాల కార్లపై వర్తిస్తాయి.

ఈ బెనిఫిట్స్ అనేది మోడల్ వేరియంట్‌ బట్టి క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్‌లు, ప్రత్యేక స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్లతో స్టాక్‌ను క్లియర్ చేయడమే కంపెనీల లక్ష్యం. ఎందుకంటే.. చాలామంది కస్టమర్లు సంవత్సరం ప్రారంభంలో కొత్త కార్లను కొనుగోళ్లు చేయాలని భావిస్తుంటారు. అయితే, సిటీ, డీలర్ స్టాక్, కస్టమర్ అర్హతను బట్టి డిస్కౌంట్లు మారవచ్చు.

జనవరిలో హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్లు :
ఈ హ్యుందాయ్ ఆఫర్లు అనేక కేటగిరీలలో ఉన్నాయి. ఎంట్రీ-లెవల్ SUV కేటగిరీలో ఎక్స్‌టర్ కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. హ్యుందాయ్ మిడ్-సైజ్ సెడాన్, వెర్నా కాంపాక్ట్ సెడాన్, ఆరా కూడా ఉన్నాయి.

Amazon Great Republic Day Sale

Amazon Great Republic Day Sale  (Image Credit To Original Source)

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వంటి హ్యాచ్‌బ్యాక్‌లు i20 ఎంపిక చేసిన వేరియంట్‌లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్లు సాధారణంగా ఎంపిక చేసిన వేరియంట్‌లకు లేదా ప్రొడక్టు బ్యాచ్‌లకు వర్తిస్తాయి. కార్ల లభ్యత అనేది వివిధ డీలర్‌షిప్‌లు, నగరాల్లో మారుతుంది.

Read Also : Smart TV Offers : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. 43-అంగుళాల స్మార్ట్‌టీవీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. టాప్ 5 మోడళ్లలో ఏది బెటర్?

హ్యుందాయ్ ఇండియా డిస్కౌంట్లు :

  • 80వేల వరకు టాప్ బెనిఫిట్స్
  • ఎక్స్-షోరూమ్ ధరపై నేరుగా క్యాష్ డిస్కౌంట్
  • పాత కారు ఎక్స్చేంజ్ కస్టమర్లకు ఎక్స్ఛేంజ్ బోనస్
  • అర్హత కలిగిన వారికి కార్పొరేట్ డిస్కౌంట్
  • డీలర్ లెవల్ స్పెషల్ ఆఫర్లు

అన్ని మోడళ్లకు ఒకే విధమైన బెనిఫిట్స్ ఉండవు. సాధారణంగా, ఎంపిక చేసిన పెట్రోల్ వేరియంట్లపై లేదా పాత స్టాక్ యూనిట్లపై అతిపెద్ద డిస్కౌంట్లు లభిస్తాయి.

హ్యుందాయ్ ఎక్స్‌టర్, వెర్నా ఆరా కార్లపై డిస్కౌంట్లు :
హ్యుందాయ్ ఎక్స్‌టర్ గరిష్టంగా రూ. 1.69 లక్షల తగ్గింపుతో లభిస్తుంది. ఇందులో రూ. 89,209 వరకు జీఎస్టీ తగ్గింపు, రూ.80వేల విలువైన ఇతర ఆఫర్‌లు ఉన్నాయి. వెర్నా సెడాన్ రూ. 1.30 లక్షల వరకు డిస్కౌంట్లతో లభిస్తుంది. ఇందులో రూ. 60,640 వరకు జీఎస్టీ తగ్గింపు, రూ. 70వేల విలువైన అదనపు ఆఫర్లు ఉన్నాయి.

జనవరి ఆఫర్లలో హ్యుందాయ్ ఆరా కూడా ఉంది. మొత్తంగా బెనిఫిట్స్ రూ. 1.06 లక్షల వరకు ఉంటాయి. ఇందులో రూ. 78,465 వరకు జీఎస్టీ తగ్గింపుతో రూ. 28వేల వరకు విలువైన ఇతర ఆఫర్లు ఉన్నాయి.