Smart TV Offers : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. 43-అంగుళాల స్మార్ట్‌టీవీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. టాప్ 5 మోడళ్లలో ఏది బెటర్?
Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ ఇండియన్ సేల్ సమయంలో 43 అంగుళాల స్మార్ట్ టీవీలు సరసమైన ధరకే కొనేసుకోవచ్చు.. ధర కూడా రూ. 12వేల లోపే ఉంటాయి..
Amazon Great Republic Day Sale (Image Credit To Original Source)
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ ఇండియన్ సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లు
43 అంగుళాల స్మార్ట్ టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్లు
టాప్ 5 స్మార్ట్ టీవీలు ఇప్పుడు రూ. 12,500 లోపు మాత్రమే
Amazon Great Republic Day Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో అనేక స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సందర్భంగా ఐదు 43-అంగుళాల టీవీ మోడల్స్ సరసమైన ధరకే కొనేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ ఐదు 43-అంగుళాల టీవీలపై ఓసారి లుక్కేయండి.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఎంచుకుని ఇంటికి తెచ్చుకోండి.
VW 43 అంగుళాలు (109 సెం.మీ) :
రూ. 24,999 ధర విలువైన ఈ టీవీ అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో ఇప్పుడు రూ. 12,999కే లభిస్తోంది. అంటే.. రూ. 12వేలు తగ్గింపు పొందింది. 43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ క్యూఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ టీవీలో అనేక ప్రీ-ఇన్‌స్టాల్ ఓటీటీ యాప్స్, 24W స్పీకర్లు, అనేక కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
ఒనిడా 108 సెం.మీ (43 అంగుళాలు) :
అమెజాన్ సేల్ సమయంలో రూ. 26,790 విలువైన ఈ టీవీని రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు. అసలు ధర కన్నా రూ. 11,791 తక్కువకే పొందవచ్చు. ఇతర ఆఫర్లతో టీవీ ధర మరింత తగ్గింపు పొందవచ్చు. 43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ టీవీలో అనేక ప్రీ-ఇన్‌స్టాల్ ఓటీటీ యాప్‌లు, 20W స్పీకర్లు వైడ్ రేంజ్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

Amazon Great Republic Day Sale (Image Credit To Original Source)
కోడాక్ 43 అంగుళాలు (108 సెం.మీ) :
కోడాక్ స్మార్ట్‌టీవీ ఫస్ట్ టైమ్ రూ. 29,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు అమెజాన్ సేల్ సమయంలో రూ. 13,999కే లభిస్తోంది.. అంటే రూ. 16వేలు సేవ్ చేసుకోవచ్చు. ఇతర ఆఫర్ల ద్వారా అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ మోడల్ టీవీ 43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. అనేక ప్రీ-ఇన్‌స్టాల్ ఓటీటీ యాప్స్, 30W స్పీకర్లు, వైడ్ రేంజ్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
Read Also : Motorola Edge 50 Pro : అమెజాన్‌లో అద్భుతమైన డీల్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై రూ.10వేలు తగ్గింపు.. ఎలాగంటే?
VW 43 అంగుళాలు (108 సెం.మీ)
సేల్ సందర్భంగా రూ. 43,999 విలువైన ఈ విడబ్ల్యూ టీవీపై రూ. 28వేల నుంచి రూ.15,999 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇతర ఆఫర్లతో అదనపు డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. 43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ క్యూఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ టీవీలో అనేక ప్రీ-ఇన్‌స్టాల్ ఓటీటీ యాప్స్, 40W స్పీకర్లు వైడ్ రేంజ్ నెట్‌వర్కింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
VW 43 అంగుళాలు (109 సెం.మీ) :
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో ఈ స్మార్ట్ టీవీ మొదట రూ.29,999 ధరకు అమ్ముడైంది. ఇప్పుడు రూ. 12,499 మాత్రమే.. అంటే రూ. 17,500 సేవ్ అవుతుంది. 43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ టీవీలో అనేక ప్రీ-ఇన్‌స్టాల్ ఓటీటీ యాప్స్, 20W స్పీకర్లు, వైడ్ రేంజ్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
