EPFO 3.0 Update : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. ATM నుంచి PF డబ్బులు తీస్తే పెన్షన్‌ కోల్పోతారా? అసలు నిజం ఇదే..!

EPFO 3.0 Update : ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం. అతి త్వరలో ఏటీఎం విత్‌డ్రాయల్స్ ఆప్షన్‌ అందుబాటులోకి రానుంది. కానీ, ఇది పెన్షన్లను ప్రభావితం చేస్తుందా? EPF, EPS రూల్స్, విత్‌డ్రాయల్ లిమిట్స్, ఈ కొత్త మార్పుపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

Big Update on EPFO

  • అతి త్వరలోనే ఈపీఎఫ్ఓ 3.0 అమల్లోకి
  • ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయొచ్చు
  • 75శాతం వరకు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి
  • పీఎఫ్ డబ్బులు ఎక్కువగా తీస్తే సర్వీసు కోల్పోతారా?

EPFO 3.0 Update : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తే పెన్షన్ మొత్తంపై ప్రభావం పడుతుందా? పెన్షన్ ప్రయోజనాలు కూడా కోల్పోతారా? పీఎఫ్ ఖాతాదారులకు దీనిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిపాదిత ఈపీఎఫ్ఓ ​​3.0 ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. ఉద్యోగులు త్వరలో ఏటీఎం కార్డులతో తమ (EPFO 3.0 Update) ఈపీఎఫ్ ఖాతాల నుంచి ఫండ్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం చాలా ఈజీగా సౌకర్యవంతంగా ఉంటుంది.

ముఖ్యంగా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న ఉద్యోగులకు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఒక ఉద్యోగి ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో ఎక్కువ మొత్తం అంటే ఉదాహరణకు.. 75శాతం వరకు, విత్‌డ్రా చేసుకుంటే అది అతని సర్వీసు కొనసాగింపుకు భంగం కలుగుతుందా?

ఈపీఎస్ కింద అందుకునే పెన్షన్‌పై ప్రభావం చూపుతుందా? అంటే అలాంటిది ఏమి ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఏయే సందర్భాల్లో పెన్షన్, సర్వీసుపై ప్రభావం పడుతుంది? పరిమితులు, రూల్స్ ఏంటి? అనేది పూర్తి వివరాలతో తెలుసుకుందాం..

EPF, EPS మధ్య తేడాలేంటి? :
ఈ విషయంలో నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏటీఎం విత్‌డ్రాయల్స్ కేవలం ఈపీఎఫ్ కార్పస్‌పై మాత్రమే వర్తిస్తాయి. అంటే.. ఉద్యోగి, కంపెనీ ఇద్దరూ కలిసి డిపాజిట్ చేసిన మొత్తంపై మాత్రమే. ఇక్కడ కూడా విత్ డ్రా లిమిట్ ఉంది. గరిష్ట విత్ డ్రా లిమిట్ 75శాతం మాత్రమే. ఈ పరిమితికి మించి విత్ డ్రా చేయడం కుదరదు.

పింఛను నిధులు వేరుగా సురక్షితంగా ఉంటాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, EPS లేదా పెన్షన్ ఫండ్ పూర్తిగా వేరుగా ఉంటుంది. ఈ ఫండ్‌లోని డిపాజిట్లను ఈ ATM సౌకర్యాన్ని ఉపయోగించి విత్‌డ్రా చేసుకోలేరు. ఈ కారణంగానే పెన్షన్ అర్హతను EPF బ్యాలెన్స్ ఆధారంగా కాకుండా, EPS కింద నమోదైన సేవా కాలం ఆధారంగా నిర్ణయిస్తారు.

Read Also : Akshaya Tritiya 2026 : ఈ అక్షయ తృతీయకు బంగారం కొనాలా? వద్దా? ఇన్వెస్టర్లలో బిగ్ కన్ఫ్యూజన్.. మార్కెట్‌లో హైటెన్షన్..!

నిపుణులు ఏం చెబుతున్నారంటే? :
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్ నుంచి పాక్షికంగా డబ్బు విత్ డ్రా చేస్తే ఉద్యోగి సర్వీసు కాలం, పెన్షన్ ఫండ్ వాటా లేదా పెన్షన్ పొందే అర్హతపై ప్రభావం చూపదని అంటున్నారు.

ఈ సమాచారం ముఖ్యంగా 50 ఏళ్ల వయస్సులో ఉన్న ఉద్యోగులకు చాలా ముఖ్యం. 50 ఏళ్ల ఉద్యోగి తమ ఈపీఎఫ్ నుంచి భారీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకున్నప్పటికీ, వారి ఈపీఎస్ సర్వీస్ రికార్డ్ రీసెట్ కాదు. కనీసం 10 ఏళ్ల అర్హత గల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. అప్పుడే పెన్షన్ పొందే రైట్ ఉంటుంది.

ఉద్యోగం మానేస్తే రూల్స్ ఏంటి? :
ఒక ఉద్యోగి తమ ఉద్యోగాన్ని మానేస్తే పెన్షన్ స్కీమ్ వాటాలను క్లెయిమ్ చేసుకోవాలంటే 36 నెలలు వేచి ఉండాలి. అంతేకాకుండా, 55 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు కూడా మొత్తం డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.

పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేయొచ్చా? :
ఉద్యోగం మానేసిన తర్వాత ఈపీఎఫ్ డబ్బులో దాదాపు మొత్తాన్ని విత్‌డ్రా చేస్తే.. అది తమ పెన్షన్‌పై ప్రభావం చూపుతుందని చాలా మంది భయపడతారు. అయితే ఇక్కడ కొన్ని నియమాలను తప్పక తెలుసుకోవాలి. ఈపీఎఫ్, ఈపీఎస్ వేర్వేరు ఖాతాలుగా గమనించాలి. ఒకదాని నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తే మరొకదానిపై ప్రభావం పడదు.

పీఎఫ్ పెన్షన్ ఫండ్స్ ఎప్పుడు విత్ డ్రా చేయొచ్చు? :
పెన్షన్ ఫండ్ ఫండ్స్ సాధారణంగా నేరుగా విత్ డ్రా చేయలేరు. దీనికి 36 నెలలు లేదా అంతకంటే ఎక్కువ గ్యాప్ అవసరం. శాశ్వత వైకల్యం, లేదా 58 ఏళ్ల వయస్సులో అర్హత వంటి నిర్దిష్ట షరతులు ఉన్నాయి. అర్హత ఉంటే.. పెన్ష్న్ ఫండ్, ఫైనల్ అమౌంట్ రెండూ ఉద్యోగి ఖాతాకు ట్రాన్స్ ఫర్ అవుతుంది.

పీఎఫ్ ఖాతాదారులు ఏం చేయాలి? :
ఈపీఎఫ్ఓ ​​3.0 కింద ఈపీఎఫ్ డబ్బు విత్ డ్రా చాలా ఈజీ కానుంది. కానీ, పింఛను నిబంధనలపై ఎలాంటి ప్రభావం ఉండదు. మీ ఈపీఎఫ్ ఫండ్స్ నిర్దేశించిన పరిమితిలోపు విత్‌డ్రా చేసుకుంటే, మీ పెన్షన్ చాలా సేఫ్. మీ పెన్షన్‌కు కీలకం మీరు ఎంత విత్‌డ్రా చేస్తారు అనేది కాదు.. ఈపీఎస్ కింద మీరు పనిచేసిన కాలాన్ని లెక్కిస్తారు.