Akshaya Tritiya 2026 : ఈ అక్షయ తృతీయకు బంగారం కొనాలా? వద్దా? ఇన్వెస్టర్లలో బిగ్ కన్ఫ్యూజన్.. మార్కెట్లో హైటెన్షన్..!
Akshaya Tritiya 2026 : ఈ అక్షయ తృతీయకు బంగారం కొనేవారికి బిగ్ న్యూస్.. బంగారం కొనాలా? వద్దా? ఒకవేళ ఇప్పుడు బంగారం కొంటే వచ్చే అక్షయ తృతీయ నాటికి ఎంత అవుతుందో తెలుసుకుందాం..
Akshaya Tritiya 2026 ( Image Credit : Gemini AI )
- అక్షయ తృతీయ రోజున బంగారం కొనేవారికి అలర్ట్
- ఈ ఏడాదిలో బంగారం కొంటే లాభమా? నష్టమా?
- వచ్చే ఏడాదికి బంగారం ధర రూ. 3 లక్షల వరకు దాటవచ్చు
Akshaya Tritiya 2026 : అక్షయ తృతీయ వస్తోంది.. బంగారం కొనేందుకు రెడీ అవుతున్నారా? అందరూ బంగారం కొన్నట్టుగానే చాలామంది పెట్టుబడిదారులు కూడా ఇదే రోజున బంగారంపై పెట్టుబడి పెడుతారు. అక్షయ తృతీయ 2026 నేపథ్యంలో బంగారం మార్కెట్‌పై భారీ చర్చ నడుస్తోంది.
బంగారం ఇప్పుడే కొనాలా? లేదా ధరలు తగ్గే వరకు వేచి చూడాలా? అనే డైలమా ఇన్వెస్టర్లను (Akshaya Tritiya 2026) కన్ఫ్యూజ్ చేస్తోంది. గోల్డ్ ధరలు గత కొన్నేళ్లుగా స్థిరంగా పెరుగుతున్నాయి. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో రూ. 3 లక్షల స్థాయికి చేరుతుందా అనే ప్రశ్న మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది.
అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు సంప్రదాయం కొనసాగినా ఈసారి ఇన్వెస్టర్లు ఎమోషన్ కన్నా స్ట్రాటజీపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ రోజున బంగారంలో పెట్టుబడి పెడితే అద్భుతమైన లాభాలు వస్తాయని భావిస్తుంటారు.
ఒకవేళ మీరు 2026 అక్షయ తృతీయ నాడు మీరు బంగారంలో పెట్టుబడి పెడితే వచ్చే ఏడాది అక్షయ తృతీయ నాటికి బంగారం విలువ ఎంత పెరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. అందుకే చాలా మంది ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తారు. గత ఏడాదిలో అక్షయ తృతీయ నాడు 10 గ్రాముల బంగారం ధర రూ. 95 వేలు ఉండగా, ప్రస్తుతం బంగారం ధర అదే 10 గ్రాములకు రూ.1.52 లక్షలకు చేరింది.
ఈసారి అక్షయ తృతీయ ఏప్రిల్ 19 (ఆదివారం) రోజున వస్తుంది. అంటే.. గత ఏడాదిలో అక్షయ తృతీయ నుంచి ఈ ఏడాదిలో అక్షయ తృతీయ వరకు పెట్టుబడిదారుల మూలధనం సుమారు 60శాతం పెరిగింది. ఇక భవిష్యత్తు విషయానికొస్తే.. ఈసారి కూడా అక్షయ తృతీయ రోజున రాబడుల పరంగా మంచి పెట్టుబడి అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
2027 అక్షయ తృతీయ నాటికి రూ. 2 లక్షలు దాటొచ్చు :
కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా ప్రకారం.. బంగారం కొత్త గరిష్ఠ స్థాయికి చేరవచ్చు. వచ్చే అక్షయ తృతీయ నాటికి బంగారం ధర రూ. 2 లక్షలను దాటవచ్చని ఆయన భావిస్తున్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వృద్ధిని, శ్రేయస్సును తెస్తుందని అంటారని, అదే నిజమవుతోందని అజయ్ కేడియా చెబుతున్నారు.
ఇది కేవలం ఒక ఏడాది కాదని, గత ఏడేళ్లుగా బంగారం ధర నిలకడగా పెరుగుతోందని అంటున్నారు. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణకు అవకాశం ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరుస్తోందని, తద్వారా బంగారానికి భారీ మద్దతు లభిస్తోందని చెబుతున్నారు.
బంగారం ధర ఇంకా పెరుగుతుందా? :
సాధారణంగా ఏదైనా వస్తువు ధర 18శాతం నుంచి 20శాతం వరకు తగ్గితే భారీ మార్పుగా చూస్తారు. కానీ, గత జనవరిలో బంగారం ధరలు సుమారు 27శాతం వరకు తగ్గాయి. ఈ తగ్గుదల దశ ఇప్పటికే పూర్తయినట్టు భావించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చారిత్రక ధోరణులను పరిశీలిస్తే.. రాబోయే రెండు నుంచి 3 నెలల్లో బంగారం ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఒకవేళ ఇంకా తగ్గుదల వచ్చినా అది స్వల్ప స్థాయిలోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
3 నుంచి 5 ఏళ్లలో గోల్డ్ వాల్యూ రూ. 3 లక్షలు అవుతుందా? :
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాబోయే 3 నుంచి ఐదేళ్లలో బంగారం ధర రూ. 3 లక్షలను దాటవచ్చని అంచనా. బంగారం ధర రెండు నుంచి 3 నెలల పాటు ఒకే స్థాయిలో కొనసాగవచ్చు. అంటే.. రూ. 10వేలు పెరిగి మళ్లీ రూ. 10,000 తగ్గుతుంది. అది ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.
