Best FD Rates 2026 : సీనియర్ సిటిజన్లకు పండగే.. ఈ ఏప్రిల్లో FDలపై అత్యధిక వడ్డీ రేట్లు అందించే బ్యాంకులివే.. ఫుల్ లిస్ట్
Best FD Rates 2026 : ఏప్రిల్ 2026లో అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSU బ్యాంకులు) ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Best FD Rates for Senior Citizens
- ఈ ఏప్రిల్లో సీనియర్ సిటిజన్ల కోసం బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లు
- అత్యధిక వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల లిస్టు ఇదే
- తక్కువ రిస్క్, స్థిరమైన రాబడితో ఎఫ్డీ రేట్లు
Best FD Rates 2026 : సినీయర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం చూస్తున్నారా? ఈ ఏప్రిల్ నెలలో అత్యధిక వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు చాలానే ఉన్నాయి. అయితే, ఏయే బ్యాంకులో ఎంత మొత్తంలో వడ్డీ రేట్లను అందిస్తున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చాలా మంది అవసరాలు (Best FD Rates 2026) పెరుగుతుంటాయి. వయస్సులో ఉన్నప్పుడు సంపాదనపై దృష్టిపెట్టినవాళ్లంతా 60 ఏళ్ల తర్వాత ఆ డబ్బును సురక్షితంగా దాచుకోవడం, నెలవారీ ఆదాయంపై ఎక్కువ ఆధారపడుతుంటారు. అందుకే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSU బ్యాంకులు) ఏప్రిల్ 2026 నుంచి సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ ఎఫ్డీ పథకాలు చాలా సేఫ్. తక్కువ రిస్క్ ఉంటాయి. స్థిరమైన రాబడిని అందిస్తాయి.
రిటైర్మెంట్ సమయంలో రోజువారీ ఖర్చులను, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఏప్రిల్ నెలలో ఫిక్స్ డ్ డిపాజట్లపై 8.25 శాతం వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల జాబితాను మీకోసం అందిస్తున్నాం..
ఏ బ్యాంకు FDలపై ఎంత వడ్డీ ఇస్తోంది? :
- పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 666 రోజుల FDపై సుమారు 7.25శాతం అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది.
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 400 రోజులకు 7.15శాతం వరకు రాబడిని ఇస్తోంది.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 444 రోజుల కాలానికి 7.1శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
- బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ కూడా సుమారు 7.1శాతం రాబడిని ఇస్తున్నాయి.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 5 నుంచి 10 ఏళ్ల కాలపరిమితి ఎఫ్డీలపై 7.05శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
- బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా దీర్ఘకాలిక FDలపై 7శాతం వరకు రాబడిని అందిస్తోంది.
ఈ బ్యాంకులు ఒకటి నుంచి 3 ఏళ్ల కాలపరిమితి FDలపై సుమారు 6.6శాతం నుంచి 6.8 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తాయి.
60 ఏళ్ల తర్వాత FD ఎందుకు ముఖ్యం :
రిటైర్మెంట్ తర్వాత చాలామందికి ఆదాయం ఉండదు. ఇలాంటి పరిస్థితులలో నెలవారీ ఆదాయం కోసం ఎఫ్డీలు అద్భుతమైన ఆప్షన్. అంతేకాదు.. సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు కొద్దిగా అధిక వడ్డీ రేట్లను పొందుతారు.
తద్వారా వృద్ధులకు అదనపు బెనిఫిట్ ఉంటుంది. ఎఫ్డీల నుంచి వచ్చే వడ్డీతో మీ ఇంటి ఖర్చులు, మందులు, ఇతర అవసరాలను తీర్చుకోవచ్చు. అలాగే, ప్రభుత్వ రంగ బ్యాంకులు భద్రతకు హామీని అందిస్తాయి. ఈ వయస్సులో చాలా కీలకం.
ఎఫ్డీ తీసుకునే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలి? :
మీ బ్యాంకు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. FDని గడువుకు ముందే క్యాన్సిల్ చేస్తే విధించే జరిమానాల గురించి తప్పకుండా తెలుసుకోండి. మీ అవసరాలకు అనుగుణంగా టర్మ్ ఎంచుకోండి. అలాగే, బ్యాంకు అందించే అదనపు ఫీచర్లు, ఆప్షన్లను కూడా తెలుసుకోండి.
