Blue Aadhaar Card
Blue Aadhaar Card : మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా? వారికి ఆధార్ కార్డు తీసుకున్నారా? సాధారణంగా ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు (Blue Aadhaar Card) తప్పనిసరిగా ఉండాలి. ఐదేళ్ల లోపు చిన్నారులకు కూడా ఆధార్ కార్డు తీసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ, ప్రభుత్వేతర పనులకు ఆధార్ కార్డు చాలా ముఖ్యం. ఆధార్ ఒక ఐడీ ప్రూఫ్‌గా ఉపయోగిస్తారు.
బ్లూ ఆధార్ కార్డు అనేది 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం అందిస్తారు. ఈ బాల ఆధార్ కార్డు ప్రత్యేకంగా తయారుచేస్తారు. చాలా మందికి బ్లూ ఆధార్ కార్డు గురించి పెద్దగా తెలియదు. బ్లూ ఆధార్ కార్డు అంటే ఏంటి? ఎలా అప్లయ్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏంటి? :
దేశంలో 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం బ్లూ ఆధార్ కార్డు అందుబాటులోకి వచ్చింది. దీన్నే బాల్ ఆధార్ కార్డు అని కూడా పిలుస్తారు. వాస్తవానికి, ఈ ఆధార్ కార్డుకు బయోమెట్రిక్స్ అవసరం లేదు.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఈ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసింది. కొన్ని ఏళ్ల క్రితం ఈ ఆధార్ కార్డును తయారుచేసేందుకు బర్త్ సర్టిఫికేట్ అవసరం. కానీ, ఇప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ అవసరం లేకుండా కూడా బ్లూ ఆధార్ కార్డును తయారు చేయవచ్చు. మీరు ఇంట్లో కూర్చునే ఈ ఆధార్ కార్డు కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా చిన్న పిల్లలను ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లడం అంత సులభం కాదు. ఇలాంటి సమయాల్లో UIDAI కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది. చిన్న పిల్లలకు ఆధార్ తయారు చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇప్పుడు బాల ఆధార్ కార్డు కోసం ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. UIDAI అధికారులు బ్లూ ఆధార్ తయారుచేసి మీ ఇంటికి వస్తారు. బాల ఆధార్ కార్డు ప్రక్రియ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలా అప్లయ్ చేయాలి? :