BSNL Postpaid Plan : BSNL బంపర్ ఆఫర్.. రూ.199కే 25GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. నెలంతా ఎంజాయ్!

BSNL Postpaid Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. కేవలం నెలకు రూ. 199 చెల్లిస్తే చాలు.. 25జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది.

BSNL Postpaid Plan

BSNL Postpaid Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ప్లాన్.. ప్రభుత్వ రంగ భారతీయ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అత్యంత చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అందిస్తోంది.

పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు తప్పక తీసుకోవాల్సిన ప్లాన్ ఇది.. అదే ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్లు రూ. 400 నుంచి అందుబాటులో ఉన్నాయి. అయితే, బీఎస్ఎన్ఎల్ 50శాతం తగ్గింపుతో కేవలం రూ. 200కే లభిస్తోంది.

బీఎస్ఎన్ఎల్ ఈ అత్యంత చౌకైన పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్ ధర నెలకు రూ. 199కే లభిస్తోంది. డేటా రోల్‌ఓవర్ బెనిఫిట్ కూడా అందుబాటులో ఉంది. డేటా కొద్దిగా తక్కువగా ఉన్నా ధర పరంగా చాలా చీప్.. ఈ రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అన్ని బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ. 199 పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందిస్తుంది. బండిల్డ్ ఫ్యామిలీ కనెక్షన్ యాడ్-ఆన్ లేదు. మొత్తం డేటా అలవెన్స్ 25జీబీ, 75జీబీ డేటా రోల్‌ఓవర్ బెనిఫిట్ కూడా అందిస్తుంది.

Read Also : OnePlus Nord CE 6 : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. ఈ వన్‌ప్లస్ 5జీ ఫోన్‌ ఇంత తక్కువా..? అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

ఫ్రీ డేటా కోటా తర్వాత ప్రతి ఎంబీకి ఒక పైసా చొప్పున డేటా ఛార్జీలు వర్తిస్తాయి. వినియోగదారులు 24×7 అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు, రోజుకు 100 SMS బెనిఫిట్ కూడా పొందవచ్చు.

ఈ రేంజ్ పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్‌ అందించే మరో టెలికాం కంపెనీ లేదు. నెలకు రూ. 199కే యూజర్లకు భారీ మొత్తంలో డేటా, ఇతర బెనిఫిట్స్ లభిస్తాయి. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా ఇదే ధరలో లభిస్తున్నాయి.

ఉదాహరణకు.. మీరు ఎయిర్‌టెల్ లేదా జియో నుంచి రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే.. డేటాతో పూర్తి నెల సర్వీస్ వ్యాలిడిటీ లభించదు. ఇది కేవలం రూ. 199 ఎంట్రీ-లెవల్ ప్లాన్. రూ. 399 ప్లాన్ అనేది రూ. 199 ప్లాన్‌లో అందించే డేటా కన్నా రెట్టింపు డేటా అందిస్తుంది.