వన్ ప్లస్ ఫోన్లలో బగ్ : స్పీడ్ డయల్ కాంటాక్ట్స్ డిలీట్ చేస్తోంది!

వన్ ప్లస్ 7 సిరీస్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు త్వరలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే మార్కెట్లో రిలీజ్ అయిన వన్ ప్లస్ యూనివర్స్ స్మార్ట్ ఫోన్ డివైజ్ ల్లో ఓ బగ్.. తెగ ఇబ్బంది పెడుతుందంట.

  • Publish Date - May 9, 2019 / 11:46 AM IST

వన్ ప్లస్ 7 సిరీస్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు త్వరలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే మార్కెట్లో రిలీజ్ అయిన వన్ ప్లస్ యూనివర్స్ స్మార్ట్ ఫోన్ డివైజ్ ల్లో ఓ బగ్.. తెగ ఇబ్బంది పెడుతుందంట.

వన్ ప్లస్ 7 సిరీస్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు త్వరలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే మార్కెట్లో రిలీజ్ అయిన వన్ ప్లస్ యూనివర్స్ స్మార్ట్ ఫోన్ డివైజ్ ల్లో ఓ బగ్.. తెగ ఇబ్బంది పెడుతుందంట. చాలామంది వన్ ప్లస్ యూజర్లు ఒకే ఇష్యూపై కంప్లయింట్ చేస్తున్నారు. వన్ ప్లస్ డివైజ్ ల్లోని స్పీడ్ డయల్ కాంటాక్ట్స్ ఆటోమాటిక్ గా డిలీట్ అవుతున్నాయట. ఈ కంప్లయింట్ కొత్తది కాదు.. 2019 జనవరి నుంచి ఈ సమస్య ఉన్నట్టు వన్ ప్లస్ యూజర్లు కంప్లయింట్ చేస్తున్నారు. 

త్వరలోనే ఫిక్స్ చేస్తాం.. అప్పటివరకూ ఇలా :
యూజర్ల నుంచి వచ్చిన కంప్లయింట్స్ ఆధారంగా తలెత్తిన బగ్ ఇష్యూను సాధ్యమైనంత త్వరగా ఫిక్స్ చేస్తామని కంపెనీ ప్రామీస్ చేసింది. వన్ ప్లస్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 9+ రన్ అవుతోంది. ఈ డివైజ్ ల్లో ఏమైనా సమస్య తలెత్తిందా? లేదో చెక్ చేస్తోంది. కొత్త ఫోన్లలో కూడా ఇదే సమస్య తలెత్తనుందా? లేదా వన్ ప్లస్ 3 ఫోన్లలో కూడా బగ్ ఇష్యూ ఉందా అనేదానిపై కంపెనీ రీచెక్ చేస్తోంది. ‘ప్రతిరోజు వన్ ప్లస్ డివైజ్ లోని.. స్పీడ్ డయల్ కాంటాక్ట్స్ ఆటోమాటిక్ గా డిలీట్ అవుతున్నాయి. ప్రతిరోజు ఉదయం.. స్పీడ్ డయల్ కాంటాక్ట్స్ లో.. నో కాంటాక్ట్స్ అని మెసేజ్ వస్తోంది. ప్రస్తుతం నేను 9.0.0 అప్ డేట్ వాడుతున్నాను’ అని ఓ వన్ ప్లస్ యూజర్.. వన్ ప్లస్ ఫారంపై పోస్టు పెట్టాడు. 

ఈ మోడల్ ఫోన్లలోనే రీసెట్ ఇష్యూ :
టెక్ రిపోర్ట్ ప్రకారం.. వన్ ప్లస్ స్పీడ్ యాప్.. ప్రతిరోజు రీసెట్ అవుతోంది. అందుకే అన్ని కాంటాక్ట్ లు ఆటో డిలీట్ అవుతున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే యాప్ రీసెట్టింగ్ జరుగుతోంది. వన్ ప్లస్3 సహా వన్ ప్లస్ డివైజ్ ల్లో ఇదే సమస్య ఉంది. వన్ ప్లస్3T, వన్ ప్లస్ 5, వన్ ప్లస్ 5T, వన్ ప్లస్ 6, వన్ ప్లస్ 6T ఫోన్లలో కూడా బగ్ ఇష్యూ ఉన్నట్టు గుర్తించారు. ఈ ఇష్యూ రోజురోజుకీ పెద్దదిగా మారిపోతోంది. దీనిపై యూజర్లు ఇఛ్చిన కంప్లయింట్ పై వన్ ప్లస్ కంపెనీ స్పందిస్తూ.. త్వరలో ఫిక్స్ చేస్తామని హామీ ఇచ్చింది. బగ్ ఇష్యూను ఫిక్స్ చేసేందుకు వన్ ప్లస్ అప్ డేట్ ను రిలీజ్ చేయాల్సి ఉంది. అప్పటివరకూ కాంటాక్ట్ లపై పేర్లను మ్యాన్యువల్ గా టైప్ చేయాలని కంపెనీ సూచించింది. 

మే 14న కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ :
వన్ ప్లస్ మొబైల్ మేకర్.. వన్ ప్లస్ 7 ప్రొ, వన్ ప్లస్ 7 కొత్త స్మార్ట్ ఫోన్లను మే 14, 2019న లాంచ్ చేయనుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు.. స్నాప్ డ్రాగన్ 855 ప్రాసిసర్ తో పనిచేయనున్నాయి. ప్రో వేరియంట్ మాత్రం.. UFS 3.0 స్టోరేజీ సపోర్ట్ తో పాటు , HDR10+ డిసిప్లేతో యూజర్లను ఎట్రాక్ట్ చేసేలా ఉంది.