Credit Score
Credit Score: గతంలో పర్సనల్ లోన్, హౌజ్ లోన్ లాంటి ఏవైనా లోన్స్ తీసుకుంటేనే పెరిగే క్రెడిట్ స్కోరు.. ఇప్పుడు వేరే మార్గాల్లోనూ పెరుగుతుంది. కొత్తగా లోన్లు తీసుకునేవారిని ఆకర్షించడానికి ప్రైవేట్ సంస్థలు ఈ ఫెసిలిటీని కల్పిస్తున్నాయి. లోన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోనే కాకుండా వ్యక్తి ఆన్ లైన్ లావాదేవీలు, ఇతర ఖర్చులు పరిగణనలోకి తీసుకుని స్కోరు పెంచే పనిలో పడ్డారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే ఈ క్రెడిట్ స్కోరింగ్ సంస్థలు.. వ్యక్తికి బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది ? పలు బిల్లులను ఎలా చెల్లిస్తున్నాడు.. ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో కొనుగోలు తీరు ఎలా ఉంది? ప్రయాణాలు చేస్తున్నారా? ఎలా ఖర్చు పెడుతున్నారు.. ఇటువంటి అంశాలన్నీ క్రోడీకరిస్తున్నాయి.
సామాజిక వేదికలు, ఇంటర్నెట్ వాడకంలాంటి వాటిని కూడా క్రెడిట్ స్కోరులో కాలిక్యులేట్ చేస్తున్నాయి. లోన్లు ఇవ్వడానికి ప్రధానంగా చూసే క్రెడిట్ స్కోరు ఉండటంతో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. రుణం తీసుకోవాలనుకునే వారు.. ఇక నుంచి బిల్లులు, బీమా పాలసీల చెల్లింపులు, ఫోన్ రీఛార్జీల వంటి వాటి అంశాలను ఆన్ లైన్ లో చెల్లించేందుకు ఇంట్రస్ట్ చూపించండి.