Car Loan EMI : కారు లోన్ ఈఎంఐ కట్టలేదా? బ్యాంక్ వెంటనే మీ కారు సీజ్ చేస్తుందా? ఆర్బీఐ రూల్స్, మీ హక్కులివే!

Car Loan EMI : మీరు ఈఎంఐ చెల్లించలేదనే కారణంతో లోన్ ఇచ్చిన బ్యాంకు మీ కారును తీసుకుపోతుందా? రికవరీ ఏజెంట్లు వచ్చి బలవంతంగా వసూలు చేస్తారా? ఇలాంటి ఆందోళనే చాలామందిలోనూ ఉంటుంది. చట్టం, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మీ హక్కులేంటో తప్పక తెలిసి ఉండాలి.

Car Loan EMI Bounced

  • ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకు కారును సీజ్ చేస్తుందా?
  • ఆర్బీఐ రూల్స్ ప్రకారం.. బ్యాంకులకు ఈ అధికారం ఉందా?
  • చట్టం, ఆర్బీఐ నిబంధనలు రుణగ్రహీతలకు రక్షణ కవచం
  • కారు సీజ్ చేసే ముందు మీ హక్కులేంటో తెలుసుకోండి

Car Loan EMI : కొత్త కారు కోసం లోన్ తీసుకున్నారా? ఈఎంఐలో కొన్న కారుకు ప్రతినెలా సరిగా పేమెంట్ చేస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో చాలామందికి ఇష్టమైన కారును ఈఎంఐలో కొనడం చాలా ఈజీగా మారింది. కానీ, కొన్నిసార్లు బడ్జెట్‌ పరంగా చాలా టైట్ అవుతుంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి కారణంగా మీరు ఒకటి లేదా రెండు ఈఎంఐలు చెల్లించలేకపోవచ్చు.

ఇలాంటి సమయంలో మీ కారును బ్యాంకులు సీజ్ చేస్తాయా? వేలం వేస్తాయా? అంటే కంగారు పడకండి. వాస్తవానికి, బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు మీ కారును అకస్మాత్తుగా జప్తు చేయలేవని గుర్తుంచుకోండి. మీకు చట్టం, ఆర్‌బిఐ నిబంధనలు అండగా నిలుస్తాయి. ఈ పరిస్థితిలో చట్టపరంగా మీ హక్కులేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సీజ్ ముందు లీగల్ నోటీసు తప్పనిసరి :
కేవలం ఒకటి లేదా రెండు ఈఎంఐ చెల్లింపులు చేయకపోతే ఏ సంస్థ కూడా వాహనాన్ని వెంటనే జప్తు చేయరాదు. ఆర్‌బీఐ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ ప్రకారం.. రుణ ఒప్పందంలో వాహనాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే మొత్తం ప్రాసెస్ క్లియర్ గా వివరించాలి.

Read Also : Apple iPhone 18 Series : ఐఫోన్ లవర్స్ గెట్ రెడీ.. ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్ వచ్చేస్తోంది.. కీలక స్పెసిఫికేషన్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్..

వాహనాన్ని జప్తు చేసే ముందు బ్యాంకు రుణగ్రహీతకు అమ్మకానికి ముందు నోటీసును, ఖాతాను రెగ్యులర్ చేసేందుకు సమయాన్ని తప్పనిసరిగా అందించాలి. నోటీసు ఇవ్వకుండా తీసుకునే ఏ చర్య కూడా చట్టవిరుద్ధమే..

రికవరీ ఏజెంట్లతో వసూళ్లపై కఠిన చర్యలు :
ఏజెంట్లు రుణ వసూలు పేరుతో మిమ్మల్ని బలవంతం చేయడం, బెదిరించడం, దుర్భాషలాడటం లేదా బహిరంగంగా అవమానించడం వంటివి చేయకూడదు. సరైన గుర్తింపు పత్రాలతో సరైన పద్ధతిలో మీతో వ్యవహరించాలి. ఒకవేళ ఏజెంట్ ఈ నియమాలను ఉల్లంఘిస్తే.. మీరు వారి కాల్ రికార్డింగ్‌లు లేదా మెసేజ్ సేవ్ చేసి బ్యాంకుకు, వినియోగదారుల ఫోరమ్‌కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.

వేలంపాటకు ముందే కారును ఇచ్చేయొచ్చు :
వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే.. పర్మినెంట్ పోయినట్లు కాదు. ఒక బ్యాంకు వాహనాన్ని వేలం వేసే ముందు రుణగ్రహీత బకాయి ఉన్న మొత్తం గురించి రాతపూర్వక సమాచారాన్ని పొందాల్సి ఉంటుంది. మీరు నిర్దేశించిన సమయంలోగా బకాయిపై రుణాన్ని, అవసరమైన ఖర్చులను తిరిగి చెల్లిస్తే మీ వాహనాన్ని తిరిగి పొందేందుకు మీకు చట్టపరమైన హక్కు ఉంటుంది.

వేలం తర్వాత మొత్తంపై మీదే హక్కు :
వాహనాన్ని ఇష్టానుసారంగా వేలం వేయకూడదు. అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము మీ బకాయిపై రుణ మొత్తం, వడ్డీ, రికవరీ ఖర్చులను మించి ఉంటే మిగిలిన మొత్తంపై మీకు మాత్రమే పూర్తి హక్కు ఉంటుంది. మీరు వేలం పూర్తి లెక్కలు, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి కూడా పొందవచ్చు.