Anil Ambani: మరో షాక్‌.. అనిల్ అంబానీ ఆర్‌కామ్‌పై రూ.2 వేల కోట్ల బ్యాంకు మోసం కేసు నమోదు చేసిన సీబీఐ.. ఆఫీసుల్లో తనిఖీలు

ఆయా సంస్థలను జూన్ 13న అధికారికంగా మోసపూరిత సంస్థలుగా గుర్తించారు.

Anil Ambani

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.2,000 కోట్లకు పైగా నష్టం కలిగించిన కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. శనివారం ఇందుకు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు జరిపామని అధికారులు చెప్పారు.

ఆర్‌కామ్, దాని ప్రొమోటర్ డైరెక్టర్ అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆయా సంస్థలను జూన్ 13న అధికారికంగా మోసపూరిత సంస్థలుగా గుర్తించారు.

Also Read: ఇంటర్ విద్యార్థులకు ఫైనల్ ఛాన్స్.. సెండ్ ఫేజ్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

అంటే నిబంధనల ప్రకారం ఆ కంపెనీలను నమ్మదగని, మోసపూరిత లావాదేవీలు చేసినవిగా గుర్తించి, వాటిపై తగిన చర్యలు తీసుకునే ప్రక్రియ ప్రారంభించారని అర్థం.

ఆర్బీఐ మాస్టర్ డైరెక్షన్స్ ఆన్ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్, బ్యాంక్ బోర్డు ఆమోదించిన పాలసీ ఆన్ క్లాసిఫికేషన్, రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫ్రాడ్స్ ప్రకారం ఈ చర్యలు తీసుకునే వీలు ఉంటుందని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి గత నెలలో లోకసభలో లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు.

“2025 జూన్ 24న ఆర్బీఐ అధికారికంగా ఆర్‌కామ్‌ సంస్థను మోసం చేసిన సంస్థ పేర్కొంటూ ఆర్బీఐకి వివరాలు తెలిపింది. అలాగే సీబీఐ వద్ద క్రిమినల్ ఫిర్యాదు చేయడానికి కూడా చర్యలు ప్రారంభించింది” అని అధికారులు తెలిపారు.