Inter Admissions: ఇంటర్ విద్యార్థులకు ఫైనల్ ఛాన్స్.. సెండ్ ఫేజ్ అడ్మిషన్స్ గడువు పొడగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రవేశాల(Inter Admissions) ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మొదటి ఫేజ్ అడ్మిషన్స్

Second Phase Inter Admissions Deadline Extension
Inter Admissions: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మొదటి ఫేజ్ అడ్మిషన్స్ పూర్తవగా ప్రస్తుతం రెండవ ఫేజ్ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలోనే ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల గడువు డేట్ ను పొడిగిస్తూ అధికారిక ప్రకటన చేసింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 20తో సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ ప్రక్రియ ముగిసిపోవాలి. కానీ, తాజాగా నిర్ణయం ప్రకారం ఆగస్టు 31వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్స్(Inter Admissions) కోసం ఇదే చివరి ఛాన్స్ అని కూడా తెలిపింది. అర్హులైన విద్యార్థులు వెంటనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది.
అయితే, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతులు జూన్ 2 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే రెగ్యూలర్ విద్యార్థులతో పాటు మరికొంత మంది విద్యార్థులు డిప్లోమా వంటి పలు కోర్సుల్లో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, ఆయా కోర్సుల్లో సీటు రానివారు మళ్ళీ ఇంటర్ లో చేరేందుకు ముందుకొస్తున్నారు. ఆ కారణంగానే ఫైనల్ ఫేజ్ గడువును పెంచుతూ బోర్డు తాజా నిర్ణయం తీసుకుంది.