UPI PIN Number
UPI PIN Change : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై యూపీఐ పిన్ డెబిట్ కార్డు లేకుండానే మార్చుకోవచ్చు. ఇప్పటివరకూ యూపీఐ లావాదేవీల విషయంలో 4 అంకెలు లేదా 6 అంకెల పిన్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉండేది. లేదంటే లావాదేవీ చేయలేం.
మీ ఫోన్ వేరొకరి చేతుల్లోకి వెళ్లినా లావాదేవీ చేయలేరు. అందుకే యూపీఐ పిన్ డెబిట్ కార్డ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. యూపీఐ క్రమం తప్పకుండా ఉపయోగించే యూజర్లు తమ పిన్‌ను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా చీటింగ్ జరిగే అవకాశాలు తగ్గుతాయి.
డెబిట్ కార్డ్ లేకుండా యూపీఐ పిన్ మార్చడం లేదా సెట్ చేయడం అవకాశం లేదు. ప్రస్తుతం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధార్ కార్డ్ ద్వారా UPI పిన్ సెట్ చేసుకునే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా, యూపీఐ వినియోగదారులు ఇప్పుడు డెబిట్ కార్డ్ లేకుండా యూపీఐ పిన్ మార్చుకోవచ్చు. యూపీఐ పేమెంట్ సిస్టమ్ ఎక్కువ మంది యూజర్లు వినియోగించుకునేలా ఈ సిస్టమ్ ప్రవేశపెట్టారు.
అయితే, ఇందుకోసం మీ ఫోన్ నంబర్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. అదనంగా, అదే ఫోన్ నంబర్‌ను బ్యాంక్ అకౌంటుతో కూడా లింక్ చేయాలి. అప్పుడే యూజర్ ఆధార్ కార్డు ద్వారా యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అదే మొబైల్ నంబర్‌ను బ్యాంకు ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు మీ యూపీఐ పిన్ మార్చడానికి లేదా సెట్ చేసేందుకు మీకు ఇకపై డెబిట్ కార్డ్ అవసరం ఉండదు.
డెబిట్ కార్డ్ లేకుండా UPI పిన్ ఎలా మార్చాలి? :