×
Ad

Christmas 2025 : హ్యాపీ క్రిస్మస్ 2025.. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ కోసం రూ. 1,000 లోపు బెస్ట్ టెక్ గిఫ్ట్స్ ఇవే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

Christmas 2025 : క్రిస్మస్ పండగ నాడు మీ స్నేహితులు, ఇష్టమైనవారికి సరసమైన గిఫ్ట్స్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. రూ. 1,000 కన్నా తక్కువ ధరలో బెస్ట్ టెక్ గాడ్జెట్లను కొనేసుకోవచ్చు.

Christmas 2025

Christmas 2025 : హ్యాపీ క్రిస్మస్ డే.. ఈ పండగ రోజున మీ స్నేహితులు లేదా కోలిగ్స్ కోసం ఏదైనా టెక్ గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకుంటున్నారా? డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఈ సాంప్రదాయకంగా తమ సన్నిహితులతో గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. అనేక ఆఫీసుల్లో ‘సీక్రెట్ శాంటా’సంప్రదాయం కొనసాగుతోంది.

ఈ సమయంలో సహోద్యోగులు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. మీ కొలీగ్, స్నేహితుడు లేదా కుటుంబ సభ్యునికి రూ. 1,000 లోపు విలువైన టెక్ గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ టెక్ గిఫ్ట్స్ లిస్టును మీకోసం అందిస్తున్నాం..

1. జియోట్యాగ్ గో :
జియోట్యాగ్ గో అనేది “లాస్ట్ అండ్ ఫౌండ్” ట్రాకర్. గూగుల్ ఫైండ్ మై డివైస్ నెట్‌వర్క్‌తో ఈజీగా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. గూగుల్ ఫైండ్ మై డివైస్ యాప్ ద్వారా వినియోగదారులు తమ వస్తువులను ట్రాక్ చేయొచ్చు. వస్తువులను త్వరగా గుర్తించవచ్చు. 120dB ఇంటర్నల్ స్పీకర్‌ను కలిగి ఉంటుంది. అమెజాన్‌లో ఈ డివైజ్ ధర రూ. 999కు లభ్యమవుతుంది.

Read Also : 2026 New Cars Launch : కొత్త కారు కొంటున్నారా? 2026లో ఇండియా రోడ్లను షేక్ చేయబోయే SUV, EV కార్లు ఇవే.. ఓ లుక్కేయండి..!

2. రియల్‌మి బడ్స్ T01 :
మీ బడ్జెట్‌లో మ్యూజిక్ ప్రియులకు ఈ ఇయర్‌బడ్‌లు అద్భుతమైన ఆప్షన్. బ్లూటూత్ V5.4 పవర్‌ఫుల్ 13mm డైనమిక్ బాస్ డ్రైవర్‌తో వస్తుంది. క్లియర్ కాల్స్ కోసం అదిరిపోయే సౌండ్ ఏఐ ఆధారిత సౌండ్ కాన్సిలేషన్ అందిస్తాయి. 10 నిమిషాల్లోనే ఫాస్ట్ ఛార్జ్ 120 నిమిషాల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. బిజీ ఎక్స్‌పర్ట్స్ సరైనది. అమెజాన్‌లో ధర రూ. 899కు లభిస్తుంది.

3. అంబ్రేన్ 360° రొటేటింగ్ మొబైల్ స్టాండ్ :
ఈ మల్టీఫేస్ మొబైల్ స్టాండ్ పూర్తి 360-డిగ్రీల భ్రమణాన్ని 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు అడ్జెస్ట్ చేయగల వ్యూ యాంగిల్స్ అందిస్తుంది. స్ట్రాంగ్ బిల్డ్ సెక్యూర్ గ్రిప్ మీ డివైజ్ సేఫ్టీగా ఉండేలా చేస్తుంది. అయితే ఫోల్డబుల్ డిజైన్ అనేది జర్నీ లేదా ఆఫీసులకు వెళ్లేవారికి చాలా పోర్టబుల్‌గా ఉంటుంది. అమెజాన్‌లో ధర రూ. 299 నుంచి లభ్యమవుతుంది.

4. పోర్ట్రోనిక్స్ కాంఫిప్యాడ్ గ్లో :
గేమర్‌లకు ఈ డివైజ్ చాలా బెస్ట్.. (Comfipad Glow) అనేది భారీ గేమింగ్ మౌస్ ప్యాడ్. 14 కస్టమైజడ్ RGB లైటింగ్ మోడ్‌లు, ఈజీ ట్రాకింగ్ కోసం మైక్రోఫైబర్ సర్‌ఫేస్ 1.8 మీటర్ల రిమూవబుల్ కేబుల్‌ను కలిగి ఉంది. భారీ సైజులో మౌస్ కీబోర్డ్ రెండింటినీ సౌకర్యవంతంగా ఉంచుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ. 663కు లభిస్తుంది.