2026 New Cars Launch : కొత్త కారు కొంటున్నారా? 2026లో ఇండియా రోడ్లను షేక్ చేయబోయే SUV, EV కార్లు ఇవే.. ఓ లుక్కేయండి..!
2026 New Cars Launch : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. జనవరి 2026లో అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీలు, ఈవీ కార్లు లాంచ్ కానున్నాయి. కొత్త ఏడాదిలో రాబోయే కార్లపై ఓసారి లుక్కేయండి..
2026 New Cars Launch
2026 New Cars Launch : కొత్త ఏడాదిలో కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2026 జనవరిలో అనేక బ్రాండ్ల నుంచి సరికొత్త కార్లు భారతీయ మార్కెట్లో లాంచ్ కానునున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే అనేక కొత్త కార్లు భారత ఆటో మార్కెట్‌లోకి ప్రవేశించనున్నాయి. ఇందులో మొత్తం ఎలక్ట్రిక్ SUV మోడల్స్ ఉండనున్నాయి.
కొత్త జనరేషన్, పాపులర్ మోడళ్లలో ఫేస్‌లిఫ్ట్‌లు ఇతర చోట్ల కనిపిస్తాయి. ఆసక్తికరంగా, కొన్ని వాహనాలు జనవరిలోనే అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. మరికొన్ని జనవరిలోనే లాంచ్ కానున్నాయి. ఆ తర్వాత నెలల్లో మరిన్ని కార్లు లాంచ్ కానున్నాయి. మొత్తంమీద, భారతీయ కారు మార్కెట్లో జనవరి 2026 కొత్త కార్లతో సందడిగా మారనుంది.
కొత్త జనరేషన్ కియా సెల్టోస్ :
జనవరి 2026 కొత్త జనరేషన్ కియా సెల్టోస్‌తో రాబోతుంది. జనవరి 2, 2026న కియా అత్యంత పాపులర్ SUVని సరికొత్త అవతార్‌లో లాంచ్ చేయనుంది. ఈ SUV కొత్త K3 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కారు సైజులో కొంచెం పెద్దదిగా మరింత క్లీన్ వెర్షన్ గా ఉంటుందని భావిస్తున్నారు.
డిజైన్ విషయానికి వస్తే.. డిజిటల్ టైగర్ నోస్ గ్రిల్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ మరింత ప్రీమియం రోడ్ ప్రెజెన్స్‌ను అందిస్తుంది. క్యాబిన్ లోపల 12.3-అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్ కనిపిస్తుంది. టెక్నాలజీ పరంగా సెగ్మెంట్ లీడర్‌గా నిలుస్తుంది. ఇంజిన్ ఆప్షన్లలో 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లు ఉంటాయి. దీని ధర దాదాపు రూ. 11 లక్షల నుంచి రూ. 21 లక్షల మధ్య ఉంటుందని అంచనా.
మహీంద్రా XUV 7XO :
2026 జనవరి 5నమహీంద్రా XUV700 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ XUV 7XOగా లాంచ్ చేయనుంది. ఈ అప్‌డేట్‌లో SUV ఫ్రంట్ లుక్ పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది. కొత్త గ్రిల్స్ ఎల్-ఆకారపు DRL కూడా ఇందులో ఉన్నాయి. క్యాబిన్ లోపల అతిపెద్ద మార్పు కనిపిస్తుంది. ట్రిపుల్-స్క్రీన్ డాష్‌బోర్డ్ కూడా ఉంటుంది. ఇంజిన్ ఆప్షన్లలో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ 2.2-లీటర్ డీజిల్‌గా ఉంటాయి. ధర విషయానికి వస్తే.. ఈ SUV మోడల్ రూ. 15 లక్షల నుంచి రూ. 26 లక్షల మధ్య లాంచ్ కావచ్చు.
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ :
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జనవరి 2026 మధ్యలో లాంచ్ కానుంది. ఈ అప్‌డేట్ ఫ్రంట్ గ్రిల్, బంపర్లు ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లను మరింత షార్ప్‌గా అడ్వాన్స్ చేస్తుంది. క్యాబిన్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, లెవెల్ 2 అడాస్ వంటి ఫీచర్లు మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి. ఈ కారు ధర రూ. 11 లక్షల నుంచి రూ. 19 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
కొత్త జనరేషన్ రెనాల్ట్ డస్టర్ :
2026లో భారత మార్కెట్లోకి రెనాల్ట్ డస్టర్ జనవరి 26న లాంచ్ కానుంది. కొత్త జనరేషన్ డస్టర్ CMF-B ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. లుక్ మరింత ప్రొఫెషనల్‌గా ఉంటుంది. లోపలి భాగంలో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, ప్రీమియం ఇంటీరియర్ ఫుల్ అడాస్ ప్యాకేజీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మార్చి 2026లో మార్కెట్ లాంచ్ జరగనుంది. ఈ కారు ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఉండవచ్చు.
మారుతి సుజుకి ఇ-విటారా :
మారుతి సుజుకి ఇ విటారా జనవరి 2026లో లాంచ్ కానుంది. మారుతి ఫస్ట్ ఫుల్ ఎలక్ట్రిక్ SUV కారుగా రానుంది. 49kWh, 61kWh రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. 543 కిలోమీటర్ల వరకు రేంజ్ కలిగి ఉందని నివేదికలు చెబుతున్నాయి. డ్యూయల్ స్క్రీన్ సెటప్, 360-డిగ్రీ కెమెరా లెవల్ 2 ADAS వంటి ఫీచర్లు మరింత మోడ్రాన్ ఈవీగా మార్చేస్తాయి. ఈ కారు ధర రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంటుందని అంచనా.
నిస్సాన్ గ్రావైట్ MPV :
నిస్సాన్ గ్రావైట్ కారు అనేది 4 మీటర్ల లోపు 7-సీటర్ MPV, జనవరి 2026లో లాంచ్ కానుంది. రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. 2+3+2 సీటింగ్ లేఅవుట్‌ను అందిస్తుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు బడ్జెట్ విభాగంలో ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కారు ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల మధ్య ఉంటుంది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ :
వచ్చే జనవరి 2026లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త LED హెడ్‌ల్యాంప్‌లు, అప్‌డేట్ ఫ్రంట్ ఎండ్ మరింత ప్రీమియం ఇంటీరియర్ కొత్త రూపాన్ని ఇస్తాయి. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ స్టాండర్డ్ సిక్స్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ధర రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్య ధర ఉండొచ్చు.
