Best Selfie Camera Phones : సెల్ఫీకెమెరా ఫోన్ కావాలా? రూ. 20వేల లోపు బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్లు ఇవే.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా?
Best Selfie Camera Phones : సెల్ఫీ కెమెరా ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. 2025లో అద్భుతమైన కెమెరా ఫీచర్లతో రూ. 20వేల లోపు ధరలో సెల్ఫీ కెమెరా ఫోన్లు లభ్యమవుతున్నాయి..
Best Selfie Camera Phones
Best Selfie Camera Phones : మంచి సెల్ఫీ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం మీ బడ్జెట్‌కు సరిపోయే అద్భుతమైన సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. రూ. 20వేల లోపు 5 బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్లలో రియల్‌మి నార్జో 90, సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో, వివో, ఐక్యూ Z10R, రియల్‌మి 15x, మోటో G86 పవర్ ఉన్నాయి. ఈ ఫోన్లలో ఆకట్టుకునే ఫ్రంట్ కెమెరాలు, అదిరిపోయే డిస్‌ప్లేలు ఉన్నాయి.
సరసమైన ధరలో క్వాలిటీ సెల్ఫీ పర్ఫార్మెన్స్ (Best Selfie Camera Phones) కోసం ఈ ఫోన్లను ఎంచుకోవచ్చు. రూ. 20వేల లోపు ధరలో కొనుగోలు చేయగల 5 అద్భుతమైన సెల్ఫీ కెమెరా ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో క్వాలిటీ ఫొటో అందించే హై-రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ ప్రియులకు అద్భుతమైన ఫోన్లుగా చెప్పొచ్చు. మీరు కూడా సెల్ఫీ కెమెరా ఫోన్ల కోసం చూస్తుంటే ఈ స్టోరీ చదివాక మీరే డిసైడ్ చేసుకోండి.
రియల్‌మి నార్జో 90 (రూ. 16,999) :
రియల్‌మి నార్జో 90 ఫోన్ 1B కలర్ ఆప్షన్లు, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.57-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 60W వైర్డ్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆప్టిక్స్ పరంగా ఫోన్ 50MP + ఆక్సిలరీ లెన్స్ డ్యూయల్ కెమెరా సెటప్, క్రిస్టల్-క్లియర్ సెల్ఫ్-పోర్ట్రెయిట్‌ల కోసం 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో (రూ. 18,990) :
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో 1B కలర్ ఆప్షన్లు, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌తో వస్తుంది. 33W వైర్డ్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 50MP + 50MP + 8MP ట్రిపుల్ కెమెరా సెటప్, క్వాలిటీ సెల్ఫ్-పోర్ట్రెయిట్‌ల కోసం 16MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.
Read Also : Apple iPhone 16e : ఖతర్నాక్ డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16e అతి చౌకైన ధరకే.. ఇలాంటి డీల్ మళ్లీ జన్మలో రాదు..!
ఐక్యూ Z10R (రూ. 19,999) :
ఐక్యూ Z10R ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో ఆధారితమైన 44W వైర్డ్ ఛార్జింగ్‌తో 5700mAh బ్యాటరీతో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 50MP + ఆక్సిలరీ లెన్స్ డ్యూయల్ కెమెరా సెటప్, షార్ప్ క్లియర్ సెల్ఫ్-పోర్ట్రెయిట్‌ల కోసం 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
రియల్‌మి 15x (రూ. 17,999):
రియల్‌మి 15x ఫోన్ 1200నిట్స్ బ్రైట్‌నెస్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.81-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. 60W వైర్డ్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని అందిస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 50MP సింగిల్ కెమెరా సెటప్, ప్రో-లెవల్ సెల్ఫ్-పోర్ట్రెయిట్‌ల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
మోటోరోలా G86 పవర్ (రూ. 17,999) :
మోటోరోలా G86 పవర్ ఫోన్ 6.67-అంగుళాల P-OLED డిస్‌ప్లే, 1B కలర్ ఆప్షన్లు, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7400 చిప్‌సెట్‌తో వస్తుంది. 30W వైర్డ్ ఛార్జింగ్‌తో 6720mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 50MP+8MP డ్యూయల్ కెమెరా సెటప్, క్లియర్ సెల్ఫ్-పోర్ట్రెయిట్‌ల కోసం 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
