CIBIL Score 800 : మీ సిబిల్ స్కోరు ఇలా ఉందా..? మీరు వద్దన్నా బ్యాంకులు పిలిచి లోన్లు ఇస్తాయి.. అది కూడా తక్కువ వడ్డీకే..!

CIBIL Score 800 : మీ సిబిల్ స్కోర్ 800 కన్నా ఎక్కువగా ఉందా? హోం లోన్లు, పర్సనల్ లోన్లపై మీరు పొందే అద్భుతమైన ప్రయోజనాలను ఓసారి వివరంగా తెలుసుకుందాం..

CIBIL Score 800

  • మీ సిబిల్ స్కోరు ఎంత ఉందో చెక్ చేశారా?
  • 800 కన్నా ఎక్కువగా స్కోరుతో ప్రయోజనాలేంటి?
  • లోన్లు తొందరగా రావాలంటే బ్యాంకులు చూసేది ఇదే
  • తక్కువ వడ్డీతో లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ఏం చూస్తాయంటే?

CIBIL Score 800 : మీ సిబిల్ స్కోరు ఎంత? ఎప్పుడైనా చెక్ చేశారా? లేదంటే ఇప్పుడే చెక్ చేసుకోండి. సిబిల్ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే అంత బెనిఫిట్ అనమాట. సాధారణంగా బ్యాంకుల సిబిల్ స్కోరు ఎక్కువగా ఉన్నవారికి తొందరగా లోన్లు ఇస్తుంటాయి. అలాగే తక్కువ వడ్డీకే లోన్లను ఆఫర్ చేస్తుంటాయి. హోం లోన్లు కావొచ్చు లేదా పర్సనల్ లోన్లు కావొచ్చు.. ఏ లోన్ అయినా బ్యాంకులు ఎంతైనా ఇచ్చేందుకు రెడీ అంటాయి.

అయితే, బ్యాంకులు కేవలం సిబిల్ స్కోరు ఆధారంగానే కాదు.. ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. ఇందులో సిబిల్ స్కోరు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదు.. మీ లోన్లు, క్రెడిట్ కార్డులను ఎంత బాధ్యతాయుతంగా వాడుతున్నారో చెబుతుంది. 800 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారిని బ్యాంకులు లో రిస్క్ కస్టమర్లుగా భావిస్తాయి. అందుకే రుణాల విషయంలో వారికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.

800కు పైగా సిబిల్ స్కోర్ ఎందుకు ముఖ్యం? :
సిబిల్ స్కోరు 300 నుంచి 900 వరకు ఉంటుంది. సాధారణంగా, 750 కన్నా ఎక్కువ స్కోరు మంచిది. కానీ, 800 ప్లస్ స్కోరు ఉంటే వాళ్లకు ఇక తిరుగులేదు. మీ ఈఎంఐలను సకాలంలో చెల్లించారు. మీ క్రెడిట్ కార్డును సరిగ్గా వాడారు. మీకు మంచి క్రెడిట్ హిస్టరీ ఉంది. ఇలాంటి కస్టమర్ల విషయంలో బ్యాంకులు డిఫాల్ట్ అయ్యే రిస్క్ తక్కువగా చూస్తాయి.

లోన్ తీసుకుంటే కలిగే బెనిఫిట్స్ ఏంటి? :
800కు పైగా సిబిల్ స్కోర్ ఉండటం చాలా అడ్వాంటేజ్. తొందరగా లోన్ వస్తుంది. బ్యాంకులు ఇలాంటి కస్టమర్లకు పిలిచి మరి లోన్లు ఇస్తాయి. ఇలాంటి కస్టమర్‌లు ఎక్కువ మొత్తంలో లోన్లు పొందవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది.

బ్యాంకులు డాక్యుమెంట్లు కూడా పెద్దగా అడగవు. కస్టమర్‌ అడిగినంత వడ్డీకే ఎక్కువ లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇలాంటి కస్టమర్‌ల వల్ల రిస్క్ తక్కువగా ఉంటుంది అందుకే బ్యాంకులు వారికి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి.

Read Also : New Tax Regime Guide : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. రూ. 20 లక్షల జీతంపై జీరో టాక్స్..! కొత్త పన్ను విధానంలో అసలు సీక్రెట్ ఇదే..!

గృహ రుణంతో ప్రయోజనాలేంటి? :
800 కన్నా ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారు సాధారణంగా అత్యంత తక్కువ హోం లోన్ వడ్డీ రేట్లను పొందవచ్చు. ప్రస్తుత ధోరణుల ప్రకారం.. ఇలాంటి వినియోగదారులు 7.1 శాతం నుంచి 8శాతం మధ్య వడ్డీ రేట్లను పొందవచ్చని అంచనా.

ఈ రేటు బ్యాంకు, రుణ మొత్తం, మీ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. మీకు స్థిరమైన ఆదాయం, మంచి ఉద్యోగం ఉంటే బ్యాంకులు ప్రత్యేక పథకాల కింద ఇంకా తక్కువ వడ్డీ రేట్లు లేదా రాయితీలను అందించవచ్చు. అయితే, తక్కువ సిబిల్ స్కోర్లు ఉన్న కస్టమర్లకు వడ్డీ రేటు 8శాతం నుంచి 10శాతం వరకు పెరగవచ్చు.

వ్యక్తిగత రుణంతో బెనిఫిట్స్ ఏంటి? :
వ్యక్తిగత రుణాలకు ఎలాంటి హామీలు ఉండవు. వడ్డీ రేట్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ, 800కు పైగా స్కోర్ ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. ఇలాంటి కస్టమర్లు 9.99శాతం నుంచి 12శాతం వరకు వడ్డీ రేట్లను పొందవచ్చు. అడ్వాన్స్ అప్రూవల్ పొందిన ఆఫర్లు, ఫాస్ట్ లోన్, నిబంధనల నుంచి కూడా భారీగా బెనిఫిట్ పొందవచ్చు. తక్కువ స్కోర్లు ఉన్నవారు 15 నుంచి 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు.

బ్యాంకులు ఏ నిబంధనల ప్రకారం రుణాలు ఇస్తాయి? :
మీ సిబిల్ స్కోర్ ఒక్కటే అన్నింటినీ నిర్ణయించదు. బ్యాంకులు ఇతర అంశాలను సైతం లెక్కలోకి తీసుకుంటాయి. ముందుగా మీ ఆదాయాన్ని, ఉద్యోగ స్థిరత్వాన్ని అంచనా వేస్తాయి. మీకు క్రమమైన ఆదాయం, స్థిరమైన ఉద్యోగం ఉంటే మీకు లోన్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఆ తర్వాత బ్యాంకులు మీ రుణ-ఆదాయ నిష్పత్తిని చూస్తాయి. మీ ఆదాయంతో పోలిస్తే.. ఇప్పటికే ఎంత అప్పు ఉందో చూస్తాయి. మీ వయస్సు, వృత్తి, నివసించే సిటీ కూడా లోన్ రావాలా? వద్దా అనేది డిసైడ్ చేస్తాయి.