డిగ్గీరాజాకు అరెస్ట్ వారెంట్ : ఒవైసీపై వివాదాస్ప వ్యాఖ్యలు..

  • Publish Date - December 25, 2018 / 06:43 AM IST

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. డబ్బు కోసమే అసదుద్దీన్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటారనీ దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంఐఎం జనరల్ సెక్రటరీ హుస్సేన్ అన్వర్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీంతో దిగ్విజయ్ కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కాగా ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడింది. 

ట్రెండింగ్ వార్తలు