PM Kisan Yojana : రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 21వ విడత విడుదల తేదీ ఇదేనా? దీపావళికి వస్తుందా?
PM Kisan Yojana : పీఎం కిసాన్ 21వ విడత వచ్చే అక్టోబర్ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. మీ అకౌంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే?

PM Kisan 21st installment
PM Kisan Yojana : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో పీఎం కిసాన్ 21వ విడత విడుదల కానుంది. ఇటీవలే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana) తదుపరి విడత రూ. 2000 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీడియా నివేదికలను పరిశీలిస్తే.. కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందు రైతుల ఖాతాలకు 21వ విడతను విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ విడత రైతులకు దీపావళి కానుకగా రానుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సాయం పొందుతారు. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో మూడు విడతలుగా జమ అవుతుంది. పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు వస్తుంది? మీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
దీపావళి నాడు 21వ విడత వస్తుందా? :
గత అక్టోబర్ 2024లో కేంద్ర ప్రభుత్వం 18వ విడతను విడుదల చేసింది. ఈసారి కూడా దీపావళి అక్టోబర్‌లోనే ఉంది. కాబట్టి ఈసారి కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం అక్టోబర్‌లోనే 21వ విడతను విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, త్వరలోనే విడుదల విడుదల వస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
స్టేటస్ చెకింగ్ తప్పనిసరి :
ప్రధానమంత్రి కిసాన్ యోజన వాయిదా కోసం మీ స్టేటస్ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. మీ స్టేటస్‌లో ఏదైనా తప్పు ఉంటే.. మీ వాయిదా నిలిచిపోవచ్చు. ఈ విషయాలను తప్పనిసరిగా చెక్ చేయండి.
E-KYC : ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. మీరు ఇంకా e-KYC పూర్తి చేయకపోతే మీకు రావాల్సిన వాయిదాలు నిలిచిపోతాయి.
ల్యాండ్ సీడింగ్ :
మీ భూమి వివరాలు సరిగ్గా ఉన్నాయా? వెరిఫై చేశారో లేదో చెక్ చేయాలి.
ఆధార్, బ్యాంక్ అకౌంట్ సమాచారం :
మీ ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లింక్ చేయాలి.
ఇందులో ఏవైనా తప్పులు ఉంటే.. మీరు వెంటనే సరిదిద్దుకోవాలి.
21వ విడత స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
మీ 21వ వాయిదా స్టేటస్ చెక్ చేసేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించండి.
- ముందుగా, పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- హోమ్‌పేజీలో, ‘Beneficiary Status’ ఆప్షన్ ఎంచుకోండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ‘Get Data’పై క్లిక్ చేయండి.
- ఆ తరువాత మీ వాయిదా స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- అన్ని వివరాలు సరిగ్గా ఉంటే.. మీ వాయిదా త్వరలో మీ ఖాతాకు జమ అవుతుంది.