Post Office MIS Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. ఒకేసారి పెట్టబడితో నెలకు రూ. 5,500 వడ్డీ పొందొచ్చు.. ఎలాగంటే?
Post Office MIS Scheme : పోస్టాఫీసు కస్టమర్లకు నెలవారీ ఆదాయ పథకంపై 7.4 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. పోస్టాఫీసు MIS పథకంలో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయవచ్చు.

Post Office MIS Scheme : పెట్టుబడిదారుల కోసం గుడ్ న్యూస్.. ఏదైనా ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా?

పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. దేశంలోని సాధారణ పౌరుల కోసం పోస్టాఫీస్ అనేక రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందిస్తోంది.

పోస్టాఫీస్‌లో TD, RD, PPF, KVP, MIS వంటి అనేక రకాల అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీస్ (MIS) నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడిదారులు ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. దీనిపై ప్రతి నెలా స్థిర వడ్డీ లభిస్తుంది.

గరిష్టంగా రూ. 15 లక్షలు జమ : పోస్టాఫీసు కస్టమర్లకు నెలవారీ ఆదాయ పథకంపై 7.4 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. పోస్టాఫీసు ఎంఐఎస్ పథకంలో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం కింద ఒకే ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.

మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. గరిష్టంగా రూ. 15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ అకౌంటులో గరిష్టంగా 3 మంది చేరవచ్చు. పోస్టాఫీసులో SIS అకౌంట్ ఓపెన్ చేసేందుకు పోస్టాఫీసులోనే సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి.

ప్రతి నెలా రూ. 5,550 ఫిక్స్‌డ్ వడ్డీ : మీరు పోస్టాఫీసులోని MIS పథకంలో ఒకేసారి రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా రూ. 5,550 ఫిక్స్‌డ్ వడ్డీ పొందవచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.4శాతం వద్ద ప్రతి ఏడాదిలో రూ.66,600 వడ్డీ లభిస్తుంది. మీరు ఈ మొత్తాన్ని 12 నెలలుగా విభజిస్తే.. మీకు ప్రతి నెలా రూ. 5,550 వడ్డీ లభిస్తుంది.

ఈ వడ్డీ ప్రతి నెలా నేరుగా మీ పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంటులో జమ అవుతుంది. ఈ పథకం 5 ఏళ్లలో మెచ్యూరిటీని అందిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత జమ చేసిన మొత్తం డబ్బు మీ సేవింగ్స్ అకౌంటుకు తిరిగి జమ అవుతుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు లేదా ఏదైనా ఆర్థికపరమైన నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.