Post Office MIS Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. ఒకేసారి పెట్టబడితో నెలకు రూ. 5,500 వడ్డీ పొందొచ్చు.. ఎలాగంటే?

Post Office MIS Scheme : పోస్టాఫీసు కస్టమర్లకు నెలవారీ ఆదాయ పథకంపై 7.4 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. పోస్టాఫీసు MIS పథకంలో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయవచ్చు.

1/8
Post Office MIS Scheme : పెట్టుబడిదారుల కోసం గుడ్ న్యూస్.. ఏదైనా ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా?
2/8
పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. దేశంలోని సాధారణ పౌరుల కోసం పోస్టాఫీస్ అనేక రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందిస్తోంది.
3/8
పోస్టాఫీస్‌లో TD, RD, PPF, KVP, MIS వంటి అనేక రకాల అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీస్ (MIS) నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడిదారులు ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. దీనిపై ప్రతి నెలా స్థిర వడ్డీ లభిస్తుంది.
4/8
గరిష్టంగా రూ. 15 లక్షలు జమ : పోస్టాఫీసు కస్టమర్లకు నెలవారీ ఆదాయ పథకంపై 7.4 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. పోస్టాఫీసు ఎంఐఎస్ పథకంలో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం కింద ఒకే ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.
5/8
మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. గరిష్టంగా రూ. 15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ అకౌంటులో గరిష్టంగా 3 మంది చేరవచ్చు. పోస్టాఫీసులో SIS అకౌంట్ ఓపెన్ చేసేందుకు పోస్టాఫీసులోనే సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి.
6/8
ప్రతి నెలా రూ. 5,550 ఫిక్స్‌డ్ వడ్డీ : మీరు పోస్టాఫీసులోని MIS పథకంలో ఒకేసారి రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా రూ. 5,550 ఫిక్స్‌డ్ వడ్డీ పొందవచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.4శాతం వద్ద ప్రతి ఏడాదిలో రూ.66,600 వడ్డీ లభిస్తుంది. మీరు ఈ మొత్తాన్ని 12 నెలలుగా విభజిస్తే.. మీకు ప్రతి నెలా రూ. 5,550 వడ్డీ లభిస్తుంది.
7/8
ఈ వడ్డీ ప్రతి నెలా నేరుగా మీ పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంటులో జమ అవుతుంది. ఈ పథకం 5 ఏళ్లలో మెచ్యూరిటీని అందిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత జమ చేసిన మొత్తం డబ్బు మీ సేవింగ్స్ అకౌంటుకు తిరిగి జమ అవుతుంది.
8/8
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు లేదా ఏదైనా ఆర్థికపరమైన నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.