పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురానున్నారా? సీబీఐసీ చైర్మన్ స్పందన ఇదే
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్) విధిస్తున్నారని సంజయ్ కుమార్ అగర్వాల్ చెప్పారు

Petrol
GST: పెట్రోల్, డీజిల్‌ను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ దీనిపై స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని పరోక్ష పన్ను కిందకి తీసుకురావడం సాధ్యం కాదన్నారు.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్) విధిస్తున్నారని సంజయ్ కుమార్ అగర్వాల్ చెప్పారు. ఈ రెండు ఇంధనాల ద్వారా రాష్ట్రాలకు వ్యాట్ రూపంలో, కేంద్రానికి ఎక్సైజ్ రూపంలో అధిక ఆదాయం వస్తుందని ఆయన వివరించారు.
Also Read: ఏపీలో వాహనమిత్ర డబ్బులు రూ.15 వేలు ఇచ్చేది వీరికే… చెక్ చేసుకోండి…
“ఆదాయంపై పడే ప్రభావం దృష్ట్యా, ఈ ఇంధనాలను జీఎస్టీ కిందకి తీసుకురావడం ప్రస్తుతానికి సాధ్యం కాదు” అని ఆయన స్పష్టం చేశారు. కాగా, భారత్ కొత్త మార్కెట్లను అన్వేషిస్తోందని తెలిపారు. దేశీయ ఎగుమతిదారులు చైనా వైపు దృష్టిసారించే ఛాన్స్ ఉందని తెలిపారు. దీంతో భారత్‌పై ట్రంప్ వేసిన 50 శాతం టారిఫ్ నష్టాలను భర్తీ చేయడానికి దోహదపడుతుందని అన్నారు.
గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనలో చేర్చలేదని చెప్పారు. చట్టపరంగా సిద్ధంగా ఉన్నాం.. కానీ, ఈ నిర్ణయం రాష్ట్రాల నుంచే రావాలని ఆమె అన్నారు.
జీఎస్టీ అమలు సమయంలోనే పెట్రోల్, డీజిల్‌పై చర్చ జరిగిందని, అరుణ్ జైట్లీ అప్పుడే దీని గురించి ప్రస్తావించారని గుర్తుచేశారు. “రాష్ట్రాలు అంగీకరించిన వెంటనే కౌన్సిల్‌లో పన్ను రేటుపై నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని చట్టంలో అమలు చేస్తారు” అని సీతారామన్ పేర్కొన్నారు.