Dream Home : ప్రాపర్టీ షో‎పై మక్కువ చూపుతున్న హైదరాబాదీలు

Dream Home : విశ్వనగరం నార్త్‌పై ఫోకస్‌ పెట్టిన క్రెడాయ్‌ హైదరాబాద్‌.. కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌లో ఈనెల్లో రెండో ప్రాపర్టీ షోను నిర్వహిచింది. ఈ ప్రాపర్టీ షోలో శివారు ప్రాంతాల్లోని నిర్మాణ సంస్థలు, పలువురు బిల్డర్స్ తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

Credai Hyderabad Property Show

Dream Home : హైదరాబాద్‌ నగరం నలువైపులా స్థిరాస్తి అభివృద్ధికి ఉన్న అవకాశాలు తెలియజేస్తూ క్రెడాయ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఈనెల్లో ఇప్పటికే రెండు మెగా ప్రాపర్టీలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నెల మొదటి వారంలో వెస్ట్ హైదరాబాద్‌కు చెందిన ప్రాపర్టీ షో హైటెక్స్‌లో జరిగింది. ఈ ప్రాపర్టీ షోకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ లభించింది. మూడురోజుల పాటు నిర్వహించిన ఈ ప్రాపర్టీ షో పలువురు ప్రముఖ బిల్లర్లు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాపర్టీల వివరాలను తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో ఈ ఎక్స్‌పోకు హాజరయ్యారు నగరవాసులు.

విశ్వనగరం నార్త్‌పై ఫోకస్‌ పెట్టిన క్రెడాయ్‌ హైదరాబాద్‌.. కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌లో ఈనెల్లో రెండో ప్రాపర్టీ షోను నిర్వహిచింది. ఈ ప్రాపర్టీ షోలో శివారు ప్రాంతాల్లోని నిర్మాణ సంస్థలు, పలువురు బిల్డర్స్ తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటి స్థలాలు, అపార్టుమెంట్స్, విల్లాలను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు. ఇక్కడ నిర్వహించిన ప్రాపర్టీ షోకు కూడా భారీ స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

నాగోల్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో :
బాలానగర్, కొంపల్లి, శామీర్ పేట్, మేడ్చల్. అల్వాల్, పటాన్‌చెరు ప్రాంతాలకు చెందిన అపార్టుమెంట్లు, విల్లాలు, ప్లాట్లు, కమర్షియల్ నిర్మాణాల వివరాలన్నీ ఒకే చోట అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు చాలా మంది ప్రాపర్టీ షోను విజిట్ చేశారు. ఇక ఈస్ట్ హైదరాబాద్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం మూడో ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది క్రెడాయ్‌ హైదరాబాద్‌. నాగోల్‌లో ఈనెల 23న ప్రారంభమైన ఈ ప్రాపర్టీ షో మూడు రోజుల పాటు జరగనుంది. రెండు రోజులు ప్రాపర్టీ షోకు భారీ స్పందన వచ్చిందని.. చివరి రోజైన ఆదివారం కూడా భారీగా సందర్శకులు వస్తారని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రతినిధులు తెలిపారు.

హైదరాబాద్‌ మహానగరంలో రియల్‌ ఎస్టేట్‌కు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుందంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌. అందుకే తమ ప్రాపర్టీ షోలకు చక్కని రెస్పాన్స్‌ లభించిందంటున్నారు. వెస్ట్‌, నార్త్‌, ఈస్ట్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలు సక్సెస్‌ కావడంతో మంచి జోష్‌లో ఉన్నాయి క్రెడాయ్‌ వర్గాలు. ఇక క్రెడాయ్‌ ఈస్ట్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షోను ప్రారంభించిన అనంతరం మంత్రి శ్రీధర్‌ బాబు కీలక ప్రకటన చేశారు. ఈస్ట్ హైదరాబాద్‌లో ఐటీ, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ని ఏర్పాటు చేయనున్నట్లు శ్రీధర్‌బాబు ప్రకటించారు. హైదరాబాద్‌కి నలువైపులా అన్ని ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈస్ట్ హైదరాబాద్‌లో కన్వెన్షన్ సెంటర్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు.

ఇక హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేలా నిర్మాణ సంస్థలు, బిల్డర్ల తమ ప్రాజెక్టులను రూపొందిస్తున్నాయి. చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచి భారీ ప్రాజెక్టుల వరకు.. సిటీలో టాప్ బిల్డర్స్ నుంచి చిన్న బిల్డర్స్… అలాగే పలు రియాల్టీ సంస్థలు తమ ప్రాజెక్టులను ఈ ప్రాపర్టీ షోలో ప్రదర్శనకు పెట్టాయి. ఒకే ప్రాంతంలో చాలా రకాల నిర్మాణాలు.., ఆయా ప్రాంతాల్లోని ధరలు అన్ని అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు తమకిష్టమైన బడ్జెడ్‌లో ఇళ్లను ఎంపిక చేసుకోవచ్చని ప్రాపర్టీ షో నిర్వాహకులు తెలిపారు.

Read Also : Dream Home : ముచ్చర్లలో కలల నగరం.. మరో సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్‌!

ట్రెండింగ్ వార్తలు