Deliveroo IDC: గ్లోబల్ ఫుడ్ డెలివరీ కంపెనీ డెలివరూ, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుంmr విద్యార్థులను ఉద్యోగాలలో నియమించుకునే లక్ష్యంతో తమ తాజా నియామక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు హైదరాబాద్‌లో ఉన్న వినూత్న ఫుడ్-టెక్ కంపెనీ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (IDC)లో పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు.
దేశంలోని ప్రతిభపై ఆధారపడి, సాంకేతికతను కీలకంగా చేసుకున్న కచ్చితమైన టెక్ సంస్థగా నిలువాలని తమ లక్ష్యాన్ని సాకారం చేసే, ప్రపంచ స్థాయి టీమ్‌ను రూపొందించుకోవాలనే డెలివరూ నిబద్ధతలో భాగంగా ఈ హైరింగ్ కార్యక్రమం భాగంగా ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, IDC మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డెలివరూ సీఈఓ హైదరాబాద్‌ను సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా డెలివరూలో దాని ప్రాముఖ్యతను నొక్కిచెప్పడం ద్వారా దానిని మరింత బలోపేతం చేసే ప్రణాళికలను ప్రకటించారు.
Telangana: దేశంలో మొట్టమొదటి మోనిన్ తయారీ యూనిట్ కు శంకుస్థాపన మంత్రి కేటీఆర్
IIIT హైదరాబాద్, NIT వరంగల్, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT), వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వంటి కొన్ని కళాశాలలను సందర్శించటం ద్వారా ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగించాలని డెలివరూ ప్రణాళిక చేస్తోంది.
డెలివరూకు సంబంధించి యునైటెడ్ కింగ్‌డమ్ వెలుపల అతిపెద్ద సాంకేతిక కేంద్రంగా భారతదేశంలోని డెలివరూ IDC నిలుస్తుంది. యునైటెడ్ కింగ్‌డమ్ లో కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది.