×
Ad

Diwali 2025 Bank Holidays : దీపావళి రోజున మీకు బ్యాంకులో పని ఉందా? ఈ వీకెండ్‌లో బ్యాంకులకు రాష్ట్రాల వారీగా సెలవులివే..!

Diwali 2025 Bank Holidays : 2025 దీపావళి సందర్భంగా రాష్ట్ర బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో అక్టోబర్ 20 నుంచి 23 వరకు బ్యాంకులు పనిచేయవు.

Diwali 2025 Bank Holidays

Diwali 2025 Bank Holidays : దీపావళి పండుగ రోజున మీకు బ్యాంకులో పని ఉందా? పండగ రోజుల్లో అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. దేశవ్యాప్తంగా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు మూడతపడతాయి. కానీ, కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు అనేవి అక్కడి రాష్ట్ర పండుగలపై ఆధారపడి ఉంటాయి.

ఈ ఏడాదిలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో  (Diwali 2025 Bank Holidays) సహా ఉత్తర భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో సోమవారం దీపావళి జరుపుకుంటున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా ఇతర రాష్ట్రాల్లో దీపావళిని మంగళవారం జరుపుకుంటున్నారు. అందుకే బ్యాంకు సెలవుల విషయంలో కొద్దిగా గందరగోళం ఏర్పడింది. మీ ప్రాంతంలో బ్యాంకులు ఏ రోజులు మూతపడతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఈసారి దీపావళి పండుగను కొందరు అక్టోబర్ 20వ తేదీ సోమవారం జరుపుకోనున్నారు. మరికొందరు అక్టోబర్ 21వ తేదీ మంగళవారం దీపావళిని జరుపుకుంటారు. సోమవారం దీపావళి జరుపుకునే రాష్ట్రాల్లో ఆ రోజు బ్యాంకులు పనిచేయవు. మంగళవారం దీపావళి జరుపుకునే రాష్ట్రాల్లో ఆరోజున బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

సోమవారం ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవంటే? :
దీపావళి, నరక చతుర్దశి, కాళీ పూజ సందర్భంగా 2025 అక్టోబర్ 20 సోమవారం రోజున అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో బ్యాంకులు పనిచేయవు. ఇందులో త్రిపుర, గుజరాత్, మిజోరం, కర్ణాటక, మధ్యప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, గోవా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి.

ఏయే రాష్ట్రాల్లో మంగళవారం బ్యాంకులు పనిచేయవంటే? :
దీపావళి అమావాస్య, దీపావళి, గోవర్ధన్ పూజల సందర్భంగా ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అక్టోబర్ 21, 2025 మంగళవారం బ్యాంకులు మూతపడతాయి. అక్టోబర్ 18న (శనివారం) బ్యాంకులు తెరిచే ఉన్నాయి. ఎందుకంటే.. ఈ నెలలో మూడో శనివారం లేదు. ధన్‌తేరాస్ రోజులు బ్యాంకులు మూతపడవు. దేశవ్యాప్తంగా సాధారణ బ్యాంకింగ్ సర్వీసులు కొనసాగుతాయి. అస్సాం మాత్రమే కటి బిహు పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

Read Also : Happy Diwali Stickers : వాట్సాప్‌లో ‘హ్యాపీ దీపావళి స్టిక్కర్లు’ ఎలా క్రియేట్ చేయాలి? డౌన్‌‌లోడ్ చేసి ఇప్పుడే స్టేటస్ పెట్టుకోండి..!

దీపావళి రోజులు బ్యాంకుల సెలవులు.. ప్రాంతాల వారీగా జాబితా :

అక్టోబర్ 20 (సోమవారం) : చతుర్దశి, కాళీ పూజ వేడుకల సందర్భంగా త్రిపుర, గుజరాత్, మిజోరం, కర్నాటక, మధ్యప్రదేశ్, చండీగఢ్ (యూటీ), తమిళనాడు, ఉత్తరాఖండ్, అస్సాం, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ (NCT), గోవా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘల్ ప్రదేశ్, జార్ఖండ్, మేఘల్ ప్రదేశ్, మిజోరం, ఛత్తీస్‌గఢ్, హిమాలీ, మేఘల్ ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో బ్యాంకులు మూతపడతాయి.

అక్టోబర్ 21 (మంగళవారం) : బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, గాంగ్‌టక్, ఇంఫాల్, జమ్మూ, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, శ్రీనగర్‌లోని బ్రాంచ్‌లు దీపావళి అమావాస్య, గోవర్ధన్ పూజ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.

అక్టోబర్ 22 (బుధవారం) : గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో బలిపాడ్యమి, లక్ష్మీ పూజ (దీపావళి), విక్రమ్ సంవత్ నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు మూతపడతాయి.

అక్టోబర్ 23 (గురువారం) : గుజరాత్, సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో భైదూజ్, చిత్రగుప్త జయంతి, లక్ష్మీ పూజ, భ్రాత్రి ద్వితీయ, నింగోల్ చకౌబా రోజున బ్యాంకులు పనిచేయవు.

రాష్ట్రాల వారీగా బ్యాంకు సెలవుల షెడ్యూల్ :
అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 28 : ఛట్ పూజ కోల్‌కతా, పాట్నా, రాంచీలలో బ్యాంకులు మూతపడతాయి.
అక్టోబర్ 31 : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో బ్యాంకులు పనిచేయవు.

బ్యాంకులు మూతపడితే ఏం చేయాలి? :
బ్యాంకులకు సెలవు దినాల్లో కూడా వినియోగదారులు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్, బిల్లు పేమెంట్స్ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎంలు, మొబైల్ యాప్‌లు, యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఉపయోగించవచ్చు. అయితే, పెద్ద మొత్తంలో క్యాష్ డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, అకౌంట్ సెటిల్‌మెంట్లు వంటి సర్వీసులు అందుబాటులో ఉండవు. బ్యాంక్ క్లోజింగ్ చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్.