×
Ad

Diwali Sale 2025 : దీపావళి పండగ ఆఫర్లు.. ఐఫోన్ 16, ఐఫోన్ 17పై అద్భుతమైన డిస్కౌంట్లు.. ఇలా కొన్నారంటే తక్కువ ధరకే..!

Diwali Sale 2025 : దీపావళి సేల్ సందర్భంగా ఐఫోన్ 16, ఐఫోన్ 17 డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఏ ఐఫోన్ మోడల్ ధర ఎంత తగ్గిందంటే?

1/6
Diwali Sale 2025 : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? దీపావళి పండగ వస్తోంది. ఈ పండగ సీజన్ సేల్ సందర్భంగా అనేక బ్రాండ్లు, ఈ-కామర్స్ స్టోర్లలో భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అందులో ఆపిల్ ఐఫోన్ 16, ఆపిల్ ఐఫోన్ 17 మోడళ్లపై కూడా అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16 విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఐఫోన్ 17 విషయానికొస్తే.. ఆపిల్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఆకర్షణీయమైన డిస్కౌంట్లను పొందవచ్చు.
2/6
ఐఫోన్ 16, ఐఫోన్ 17పై డిస్కౌంట్లు : ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ అసలు ధర రూ.79,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.57,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ సమయంలో యూపీఐ లావాదేవీలతో అదనంగా రూ.1000 తగ్గింపు కూడా పొందవచ్చు. - బ్లాక్, రోజ్, టీల్ అనే 3 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
3/6
ఇక ఐఫోన్ 17 విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో రూ.82,900కు లభిస్తుంది. మీరు అమెక్స్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి కార్డ్ ద్వారా ఐఫోన్ 17 కొనుగోలు చేస్తే.. రూ.5వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఐఫోన్ 17 బ్లాక్, లావెండర్, మిస్ట్ బ్లూ, సేజ్, వైట్ అనే 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
4/6
ఐఫోన్ 16, ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 16 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఆపిల్ A18 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఈ ఐఫోన్ 48MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ స్నాపర్‌ కలిగి ఉంది. 3651mAh బ్యాటరీతో పాటు 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రన్ అవుతుంది.
5/6
ఆపిల్ ఐఫోన్ 17 ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. ఆపిల్ A19 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. iOS26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది.
6/6
ఈ హ్యాండ్‌సెట్‌లో 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ 18MP ఫ్రంట్ స్నాపర్ కనిపిస్తుంది. 25W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 3692mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది.