మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా? ఒకవేళ చేయకపోతే వెంటనే మీ ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకోండి. లేదంటే.. ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ చేయలేరు. ఆధార్, పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉందని ఐటి విభాగం సోమవారం (మార్చి 16, 2020)న ప్రకటించింది. ఈ తేది లోపు ఆధార్ కార్డుతో PAN కార్డు లింక్ చేయకపోతే PAN కార్డ్ పనిచేయదని ఇన్కం టాక్స్ ఇండియా ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ఆధార్, పాన్ కార్డు లింకింగ్ ప్రాసెస్ ను ఎన్నోసార్లు పొడిగించినప్పటికీ కొంతమంది తమ కార్డులను లింక్ చేసుకోలేకపోయారు. ఇప్పటివరకూ ఆధార్, పాన్ కార్డులను లింక్ చేసుకోనివారు ఎలా లింక్ చేసుకోవాలో ఈ కింద ఇచ్చిన వీడియోని చూసి షాలో అవ్వండి.
* SMS ద్వారా ఆధార్ పాన్ కార్డు లింకింగ్ చేసుకోవాలంటే?
పన్నుదారులు తమ ఆధార్ కార్డుతో పాన్ కార్డును SMS ద్వారా లింక్ చేసుకోవచ్చు. అదెలా అంటే..
1. మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్ నుంచి 567678 లేదా 56161 నంబర్ కు SMS చేయాలి.
2. మీరు పంపించే SMS ఫార్మాట్ UIDPAN <SPACE><10సంఖ్యల ఆధార్ నంబర్><10సంఖ్యల PAN నంబర్> టైప్ చేసి.. పైన ఇచ్చిన రెండు నంబర్లలో ఏదో ఒక నంబర్ కు Send చేయాలి.
3. ప్రాసెస్ కంప్లీట్ కాగానే.. మీకు వెంటనే సక్సెస్ ఫుల్ అయినట్టుగా మెసేజ్ వస్తుంది.
Don’t miss the deadline!
It is mandatory to link your PAN and Aadhaar before 31st March, 2020.
You can do it through Biometric Aadhaar authentication & also by visiting the PAN service centers of NSDL and UTITSL #PANAadhaarLinkingLink: https://t.co/JudH8IqpQb pic.twitter.com/igAfV8vJUi
— Income Tax India (@IncomeTaxIndia) March 16, 2020
* ఆన్ లైన్ లింకింగ్ :
మీ పాన్ కార్డు నెంబర్ ను ఆధార్ కార్డుతో రెండు రకాలుగా లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటి.. ఇన్ కమ్ ట్యాక్స్ ఈ-ఫీల్లింగ్ పోర్టల్ విజిట్ చేయడం.. ఇక రెండోవది.. ఈ-ఫిల్లింగ్ వెబ్ సైట్ లో రిజిస్ట్రర్ కావడం, అకౌంట్ లో లాగిన్ అవసరం లేకుండా కూడా లింక్ చేసుకోవచ్చు.
1. e-Filling అకౌంట్ లో User Login అవసరం లేకుండా ఆధార్-పాన్ ఇలా Link చేసుకోవచ్చు.
2. ఈ పోర్టల్ వెబ్ సైట్ ను.. www.incometaxindiaefiling.gov.in ఓపెన్ చేయండి.
3. లింక్ ఆధార్.. Link Aadhaarఅనే ఆప్షన్ కనిపిస్తుంది.. ఈ లింక్ పై క్లిక్ చేయండి.
4. అవసరమైన వివరాలు.. అంటే.. మీ పాన్ కార్డు నంబర్, ఆధార్ నంబర్, మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి
5. మీ వివరాలను వెరిఫై చేశాక Submit బటన్ పై క్లిక్ చేయండి.
6. UIDAI నుంచి పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ అయినట్టు కన్ఫర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది.
* మీ e-Filing అకౌంట్ లో User Login అయ్యాక కూడా ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకోవచ్చు.
1. www.incometaxindiaefiling.gov.in ఓపెన్ చేయండి. ఈ వెబ్ సైట్ లో రిజిస్ట్రర్ అయిన మీ అకౌంట్ నుంచి ఆధార్, పాన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఎలానంటే?
2. మీ అకౌంట్ లో లాగిన్ కాగానే.. ఓ పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ పాన్, ఆధార్ కార్డు లింక్ చేసుకునే ఆప్షన్ స్ర్కీన్ పై కనిపిస్తుంది. వెబ్ సైట్ లోని Top bar పై ఉన్న బ్లూ ట్యాబ్ దగ్గర (Profiles Settings) అని ఉంటుంది. అక్కడ ‘లింక్ ఆధార్’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఒకవేళ మీకు అకౌంట్ లో లాగిన కాగానే పాప్ అప్ విండో కనిపించలేదంటే?
3. ఈ-ఫిల్లింగ్ వెబ్ సైట్ లో రిజిస్ట్రర్ అయ్యే సమయంలో మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసే ఉంటారు కదా. ఈ వివరాలతో మీ ఆధార్ కార్డును వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
4. మీ ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి.. Captcha code ఎంటర్ చేసి.. లింక్ నౌ (Link Now)పై క్లిక్ చేయండి.
5. మీకు ఓ Pop-Up మెసేజ్ వస్తుంది. మీ ఆధార్ కార్డు సక్సెస్ ఫుల్ గా పాన్ కార్డుతో లింక్ అయినట్టుగా కనిపిస్తుంది.
Also Read | TSRJC CET- 2020 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం