Dream Home : నెరవేరనున్న సొంతింటి స్వప్నం.. హైదరాబాద్‌లో భారీగా రానున్న హౌసింగ్‌ ప్రాజెక్టులు

Upcoming Housing Projects in Hyderabad : గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్‌లో ప్రాపర్టీల హ్యాండోవర్‌ సంఖ్య ఎక్కువగా ఉందని రియాల్టీ రంగ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. 

Dream Home : upcoming housing projects in hyderabad by 2024 year end

Upcoming Housing Projects in Hyderabad : ఈ ఏడాది చివరినాటికి హైదరాబాద్‌లో పెద్దసంఖ్యలో నిర్మాణ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. పోస్ట్‌ కోవిడ్‌ సమయంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు ఈ ఏడాది చివర్లో కస్టమర్లకు హ్యాండోవర్‌ చేసేందుకు నిర్మాణ సంస్థలు ప్లాన్‌ చేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్‌లో ప్రాపర్టీల హ్యాండోవర్‌ సంఖ్య ఎక్కువగా ఉందని రియాల్టీ రంగ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

Read Also : Home Construction : ఇలా చేస్తే.. ఇంటి నిర్మాణ ఖర్చులు భారీగా తగ్గించుకోవచ్చు..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్… జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు డెస్టినేషన్‌గా మారింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సుస్థిర ప్రభుత్వాలు ఉండడం… అన్ని రకాల అభివృద్ధికి చేయూతనిస్తుడటంతో హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకు అనుగుణంగా హైదరాబాద్‌లో నివాస సముదాయాలు అవసరం అవుతున్నాయి. స్పాట్‌..

హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చాలా వేగంగా పెరుగుతోంది. ప్రతి ఏటా వేలాది హౌసింగ్ యూనిట్స్‌ను  కొనుగోలుదారులకు హ్యాండోవర్‌ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. ఇక గత ఏడాది గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సరౌండింగ్‌ ఏరియాస్‌లో భారీగా ఇండిపెండెంట్ ఇళ్లు.. ఫ్లాట్స్‌ అమ్ముడుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 90 వేల ఫ్లాట్స్‌అమ్ముడు పోగా… అందులో 83 వేల ప్రాపర్టీలు హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనే అమ్ముడయ్యాయి. ఈ ప్రాపర్టీల విక్రయంతో ప్రభుత్వానికి 3వేలా 4వందల కోట్ల వరకు ఆదాయం వచ్చింది.

ఈ ఏడాది చివర్లో కస్టమర్లకు : 
అంతేకాకుండా ఇండిపెండెంట్ ఇళ్లు, సెకండరీ హోమ్స్‌ సైతం లక్ష వరకు అమ్ముడుపోయినట్టు రిజిస్ట్రేషన్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి 2 వేలా 3 వందల కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈ సారి కూడా అంతకు మించిన స్థాయిలో ప్రాపర్టీల అమ్మకాలు ఉంటాయని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పోస్ట్‌ కోవిడ్‌ సమయంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు… ప్రస్తుతం హ్యాండోవర్‌ స్టేజ్‌లో ఉన్నాయి. మరిన్ని ప్రాజెక్టులు ఈ ఏడాది చివరినాటికి పూర్తికానున్నాయని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

హైదరాబాద్‌కు నలువైపులా అనేక కొత్త కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్స్‌ ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో 50 అంతస్తులకు పైగా టాలెస్ట్‌ బిల్డింగ్స్‌ చాలావరకు పట్టాలెక్కాయి. ఇంకా అనేక భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల ఫైల్స్ ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉన్నాయి. ఈ అంశాలు హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్‌కు ఉన్న ప్రత్యేకతను చాటుతున్నాయి.

Read Also : Dream Home: అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై భారీ ఆశలు.. ఆ రేంజ్‌లో ఇళ్లు రావాలంటోన్న నిపుణులు

ట్రెండింగ్ వార్తలు