EV scooter sales: ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి. గత నెల మొత్తం కలిపి 2.17 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. అక్టోబర్‌లోనైతే అంతకు మించి 2.36 లక్షల యూనిట్లను ఆయా కంపెనీలు అమ్మాయి.
ఇక టూ వీలర్ విక్రయాలు గతనెలలో 20 శాతం తగ్గి 1.15 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. అక్టోబర్ నెలలో అమ్ముడుపోయిన టూ వీలర్ల సంఖ్య 1.44 లక్షల యూనిట్లు. ఈవీ టూ వీలర్ల విక్రయాల్లో టీవీఎస్ మోటార్ అగ్రస్థానంలో ఉంది. జీఎస్టీ తగ్గింపుతో అక్టోబర్, నవంబర్‌లో కార్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి.
Also Read: ఎట్టకేలకు ఇమ్రాన్‌ను కలిసిన ఆయన సోదరి.. సంచలన కామెంట్స్
టూ వీలర్ అమ్మకాలు ఇలా..
- టీవీఎస్ మార్కెట్ వాటా 25.92 శాతం.
- నవంబర్‌లో టీవీఎస్ అమ్మకాలు 29,756 యూనిట్లు.
- ఓలా ఎలక్ట్రిక్ చాలా కాలం అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు 5వ స్థానానికి పడిపోయింది.
- రెండో స్థానంలో ఉన్న బజాజ్ ఆటో అమ్మకాలు నవంబర్‌లో 20 శాతం తగ్గాయి.
- బజాజ్ నవంబర్ అమ్మకాలు 25,085 యూనిట్లు.
- అక్టోబర్ అమ్మకాలు 31,392 యూనిట్లు.
- బజాజ్ మార్కెట్ వాటా 21.85 శాతం.
- నవంబర్‌లో ఏథర్ ఎనర్జీ మూడో స్థానంలో నిలిచింది.
- నెలవారీ అమ్మకాల్లో 30 శాతం క్షీణత.
- అక్టోబర్ అమ్మకాలు 28,405 యూనిట్లు.
- నవంబర్ అమ్మకాలు 20,018 యూనిట్లు.
- ఏథర్ మార్కెట్ వాటా 17.43 శాతం.
- హీరో మోటోకార్ప్ అమ్మకాలు 26.34 శాతం తగ్గాయి.
- నవంబర్‌లో హీరో అమ్మకాలు 11,795 యూనిట్లు.
- హీరో మార్కెట్ వాటా 10.27 శాతం.
- ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ అమ్మకాలు 50 శాతం క్షీణించాయి.
- ఓలా అమ్మకాలు 8,254 యూనిట్లు.
- దీంతో ఓలా 5వ స్థానానికి పడిపోయింది.
నవంబర్‌లో కార్ల అమ్మకాలు
- ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 21 శాతం పెరిగి 4,25,000 యూనిట్లు.
- మారుతీ సుజుకీ అమ్మకాలు 21 శాతం పెరిగి 1,70,971 యూనిట్లు.
- డీలర్ల వద్ద పెండింగ్ ఆర్డర్లు 1.5 లక్షలు.
- చిన్న కార్ల (ఆల్టో, కే10, ఎస్–ప్రెస్సో, సెలారియో, వాగన్‌ఆర్) అమ్మకాలు 37 శాతం పెరుగుదల.
- టాటా మోటార్స్ అమ్మకాలు 57,436 యూనిట్లు.
- మహీంద్రా అండ్ మహీంద్రా 56,336 యూనిట్లు.
- హ్యుండాయ్ ఇండియా 50,340 యూనిట్లు.
- టయోటా కిర్లోస్కర్ 33,752 యూనిట్లు.
- జీఎస్టీ తగ్గింపుతో అక్టోబర్, నవంబర్‌లో కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
- విద్యుత్ కార్ల అమ్మకాలు నవంబర్‌లో 14,700 యూనిట్లు.
- అక్టోబర్‌లో ఇవి 19,000 యూనిట్లు.