Elon Musk: ట్రంప్ విజయంతో ఎలాన్ మస్క్ జోరు.. సంపదలో ప్రపంచ రికార్డు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం తరువాత ఎలాన్ మస్క్ జోరు కొనసాగుతుంది. వ్యక్తిగత సంపద వృద్ధిలో వేగంగా దూసుకెళ్తున్నారు.

Elon Musk

Elon Musk 400 Billion Dollors: స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత, అపరకుబేరుడు ఎలాన్ మస్క్ జోరు కొనసాగుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో కీలక భూమిక పోషించిన ఎలాన్ మస్క్.. ఆ తరువాత కాలంలో తన వ్యక్తిగత సంపద వృద్ధిలో వేగంగా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మస్క్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. 2022లో ఒకానొక సమయంలో 200 బిలియన్ డాలర్ల కంటే దిగువకు మస్క్ పడిపోయాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంతో అతని దశ మారిపోయింది. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంకోసం మస్క్ భారీ మొత్తంలో రిపబ్లికన్ పార్టీకి విరాళాలు ఇచ్చారు. అంతేకాక.. ట్రంప్ విజయంకోసం విస్తృత ప్రచారం చేశాడు. దీంతో యూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించిన తరువాత తన కేబినెట్ లో మస్క్ కు కీలక పదవి అప్పగించారు.

Also Read: Facebook Down : ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌‌స్టాగ్రామ్ సర్వీసులు డౌన్.. యూజర్ల తీవ్ర ఇబ్బందులు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తరువాత టెస్లా స్టాక్స్ దాదాపు 65శాతం పెరిగాయి. ఎలాన్ మస్క్ డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటైన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను క్రమబద్దీకరిస్తారని మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఈ నేఫథ్యంలో టెస్లా స్టాక్స్ భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ సంపాదించలేనంత డబ్బును ఎలాన్ మస్క్ సంపాదించి రికార్డు నెలకొల్పాడు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించిన వివరాల ప్రకారం.. వ్యక్తిగత సంపాదనపరంగా తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి మస్క్ చేరిపోయాడు. ప్రస్తుతం అతని ఆదాయం 439.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

 

స్పేస్ ఎక్స్ లోని అంతర్గత వాటా విక్రయంతో ఆయన సంపాదన దాదాపు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని బ్లూబ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ పేర్కొంది. స్పేస్ ఎక్స్ ఆదాయంలో ఎక్కువ శాతం అమెరికా ప్రభుత్వం ఒప్పందాల మీదనే ఆధారపడింది. త్వరలో ట్రంప్ బాధ్యతలు తీసుకోనుండడంతో దానికి భారీగా మద్దతు లభించే అవకాశం ఉంది.