Elon Musk to step down as Twitter CEO soon _ who will be the next Twitter head
Twitter CEO Elon Musk : ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రస్తుతం ట్విట్టర్ సీఈఓగా ఉన్నాడు. త్వరలో మస్క్ ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎలన్ మస్క్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి తాను ట్విట్టర్ సీఈఓ పదవి నుండి వైదొలగాలనుకుంటున్నట్లు చెప్పాడు. తన తర్వాత ట్విట్టర్ CEO ఎవరు అని మాత్రం మస్క్ ధృవీకరించలేదు. నివేదికలను పరిశీలిస్తే.. మస్క్ ట్విట్టర్ సీఈఓగా వైదొలిగితే.. ఆయన సన్నిహితుడు కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. వాస్తవానికి, మస్క్ ట్విట్టర్‌లో ఖర్చులను తగ్గించడంలో సాయం చేసిన వ్యక్తి కావచ్చునని నివేదికలు చెబుతున్నాయి.
లేటెస్ట్ నివేదిక ప్రకారం.. (The Boring Company) సీఈఓ స్టీవ్ డేవిస్ తదుపరి Twitter CEO కావచ్చు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మస్క్ ట్విట్టర్‌ని మరింత మెరుగుపరచడంలో డేవిస్ సాయం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్విట్టర్ తదుపరి CEO డేవిస్ కావచ్చని స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి, గత ఏడాదిలో మస్క్ ట్విట్టర్ టీంలో డేవిస్ కీలక పాత్ర పోషించాడు. మస్క్ హార్డ్‌కోర్ వర్క్ కల్చర్‌ని ప్రవేశపెట్టిన తర్వాత ట్విట్టర్ ఆఫీసులో మొదటి ఉద్యోగిగా డేవిడ్ తన వంతు సాయం చేస్తున్నాడని నివేదికలు సూచిస్తున్నాయి.
మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి డేవిస్ ట్విట్టర్ ఖర్చులను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాడు. ట్విట్టర్‌లో ఇటీవల జరిగిన ఉద్యోగుల తొలగింపులో డేవిస్ కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. మైక్రోబ్లాగింగ్ సైట్ ఇటీవల ప్రొడక్టు నిర్వాహకులు, ఇంజనీర్లు, డేటా సైన్స్ విభాగంలోని వ్యక్తులతో సహా దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించాడు.
Twitter CEO Elon Musk : Elon Musk to step down as Twitter CEO soon _ who will be the next Twitter head
స్టీవ్ డేవిస్ (Steve Davis) ఎవరు?
డేవిస్ చాలా కాలంగా మస్క్‌కి సన్నిహిత సహచరుడిగా ఉన్నాడు. 2019లో ది బోరింగ్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టే ముందు డేవిస్ స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేశారు. నివేదిక ప్రకారం.. మస్క్‌తో డేవిస్ 2003 నుంచి కలిసి పనిచేశారు. ఇప్పుడు బిలియనీర్ ట్విట్టర్ CEO స్థానాన్ని భర్తీ చేసేందుకు డేవిస్ వైపు చూస్తున్నారు. మస్క్ ఇటీవల ఇంటర్వ్యూలో తన స్థానం నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్లు వెల్లడించాడు. సాఫ్ట్‌వేర్ & సర్వర్‌ల బృందాలను మాత్రమే నిర్వహిస్తానని చెప్పాడు. గత ఏడాదిలో కొనుగోలు చేసినప్పటి నుంచి డేవిస్ ట్విట్టర్ కోసం మస్క్‌తో సన్నిహితంగా పనిచేస్తున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ట్విటర్‌లో 500 మిలియన్ డాలర్ల ఖర్చులను తగ్గించాలని మస్క్ డేవిస్‌కు బాధ్యత అప్పజేప్పాడాని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
అయితే అతను దాదాపు 1 బిలియన్ డాలర్లు తగ్గించాడు. ట్విట్టర్ ఖర్చులను తగ్గించడంలో కీలకంగా వ్యవహరించాడు. అందుకే, మస్క్ అతనిని ట్విట్టర్ తర్వాతి CEOగా ఎన్నుకుంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి తాను వైదొలగాలనుకుంటున్నట్లు మస్క్ చెప్పినప్పటికీ.. ఆయన తన పూర్తి అధికారాన్ని వదులుకునే అవకాశం లేదు. మస్క్ ప్రస్తుతం ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్ టీమ్‌లతో కలిసి పని చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తానని తెలిపాడు. డిసెంబర్ 2022లో కొత్త CEOని నియమించిన తర్వాత కూడా మస్క్ సాఫ్ట్‌వేర్, సర్వర్ టీమ్‌లను నిర్వహించడం కొనసాగిస్తానని స్పష్టంగా పేర్కొన్నాడు. అప్పట్లోనే తాను ట్విట్టర్ బాధ్యతలను చేపట్టడంపై స్పందిస్తూ CEO పదవికి రాజీనామా చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత, తాను సాఫ్ట్‌వేర్ & సర్వర్‌ల టీంలను రన్ చేస్తానని బిలియనీర్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Read Also : OnePlus Nord CE 3 Phone : భారత్‌కు వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?