Elon Musk: ఎలన్‌ మస్క్‌ సంపాదన.. పాక్‌ జీడీపీ కన్నా ఎక్కువ!

ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ అంతులేని సంపాదనతో ఎదిగిపోతున్నారు. ఆయన కంపెనీ టెస్లా షేర్లు అమాంతం పెరిగిపోవడంతో ఒక్కరోజులోనే 36 బిలియన్ డాలర్లు సంపాదించారు మస్క్.

Elon Musk GDP of Pakistan : ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ అంతులేని సంపాదనతో ఎదిగిపోతున్నారు. ఆయన కంపెనీ టెస్లా షేర్లు అమాంతం పెరిగిపోవడంతో ఒక్కరోజులోనే 36 బిలియన్ డాలర్లు సంపాదించారు మస్క్. దాంతో మస్క్ సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం ఎలన్ మస్క్ సంపాదన 300 బిలియన్ డాలర్లకు చేరువైంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత సంపాదన కలిగిన మొదటివ్యక్తిగా మస్క్ అవతరించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మొత్తం జీడీపీని కూడా దాటేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. ఈయన సంపాదన మొత్తంగా పాక్ జీడీపీ కన్నా ఎక్కువట.

ప్రస్తుతం మస్క్ నికర ఆదాయం విలువ 292 బిలియన్ డాలర్లుగా ఉంది. 220 మిలియన్ల జనాభా కలిగిన పాకిస్థాన్ జీడీపీ.. ప్రస్తుతం దాదాపు 280 బిలియన్ డాలర్లుగానే ఉంది. అంటే.. పాక్ ప్రజల మొత్తం సంపద కన్నా మస్క్ 12 బిలియన్ డాలర్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు అనమాట.
Made In India : కార్బన్ నుంచి చౌకైన ధరకే స్మార్ట్ LED TV.. వెంటనే కొనేసుకోండి!

అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ లూయీజ్ అనే కాలమిస్ట్ మస్క్ సంపదపై పోస్టు చేశారు. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకేముంది.. ఎలన్ మస్క్.. పాకిస్తాన్ కొనేస్తారా? అంటూ నెటిజన్లు కామెంట్లు మీద కామెంట్లు పెడుతున్నారు. హెర్ట్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ లక్ష టెస్లా కార్లకు ఆర్డర్ ఇచ్చింది.

ఈ నెల 25నాటికి మార్కెట్ ట్రేడింగ్‌లో టెస్లా కంపెనీ షేరు విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. మస్క్ సంపద కూడా ఆ ఒక్కరోజే 36 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. 2021లో ఇప్పటివరకు మస్క్ సంపద 120 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ పేర్కొంది. టెస్లా స్టాక్ విలువ కూడా 2021లో 45శాతం మేర పెరిగింది. ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ అగ్ర స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఉన్నారు. బెజోస్ సంపాదన కన్నా మస్క్ సంపాదన దాదాపు 100 బిలియన్ డాలర్లు ఎక్కువ.
Read Also : LPG Price : నవంబర్ 01వ తేదీ..మారనున్న రూల్స్

ట్రెండింగ్ వార్తలు