EPFO Refund Money : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ బ్రేకింగ్, ఇక PF డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి.. ఎవరు అర్హులు?
EPFO Refund Money: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై రూ.1,000 వరకు తక్కువ ఫండ్స్ ఉన్న ఇన్ యాక్టివ్ పీఎఫ్ అకౌంట్లలో డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. అది ఎలాగంటే?
EPFO Refund Money
- రూ. వెయ్యి లోపు ఫండ్స్‌తో ఎన్ని ఈపీఎఫ్ఓ అకౌంట్లు ఉన్నాయి?
- ఈపీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి కీలక నిర్ణయం
- ఇన్ యాక్టివ్ పీఎఫ్ అకౌంట్లలో డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి
- మొత్తం 3.1 మిలియన్ ఇన్ యాక్టివ్ అకౌంట్లలో సుమారు 6 లక్షల ఖాతాలు గుర్తింపు
EPFO Refund Money : ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. ఇకపై మీ పాత పీఎఫ్ అకౌంట్ ఇన్ యాక్టివ్ ఉన్నా అందులోని ఫండ్స్ నేరుగా మీ బ్యాంకు అకౌంట్లలో క్రెడిట్ కానున్నాయి. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారుల పీఎఫ్ అకౌంట్లకు సంబంధించి కార్మిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
మంత్రిత్వ శాఖ కొత్త పథకం ప్రకారం.. క్లోజ్ చేసిన పీఎఫ్ అకౌంట్ల నుంచి ఫండ్స్ తీసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి పేపర్ వర్క్ అవసరం ఉండదు. నేరుగా మీ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.
ఏయే ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి? :
ఈ కొత్త పథకం కింద రూ.1,000 లేదా అంతకంటే తక్కువ డిపాజిట్లు ఉన్న ఇన్ యాక్టివ్ లేదా డోర్ మ్యాట్ అకౌంట్లకు వర్తిస్తుంది. డిపార్ట్మెంట్ ప్రకారం.. ఖాతాదారులు ఇకపై ఎలాంటి అప్లికేషన్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డులతో అకౌంట్లు లింక్ అయిన వారి బ్యాంకు ఖాతాలకు డిపార్ట్మెంట్ వెంటనే ఫండ్స్ ట్రాన్స్ ఫర్ చేస్తుంది. మిగిలిన ఫండ్స్ కూడా క్రమంగా ట్రాన్స్ ఫర్ అవుతాయి.
ప్రభుత్వ ప్లానింగ్ ఏంటి? :
నిబంధనల ప్రకారం.. వరుసగా 3 ఏళ్లు ఈపీఎఫ్ఓ అకౌంటులో ఎలాంటి యాక్టివిటీ లేకుంటే అది ఇన్ యాక్టివ్ అయిపోతుంది. అప్పటికే పాత పీఎఫ్ ఖాతాలలో కొద్ది మొత్తం డబ్బు ఉంటే ఇప్పుడు రీఫండ్ ప్రాసెస్ ద్వారా బ్యాంకు అకౌంట్లలో నేరుగా డిపాజిట్ కానుంది.
ప్రస్తుతం ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభ దశలో ఉంది. మొత్తం 3.1 మిలియన్ ఇన్ యాక్టివ్ అకౌంట్ల నుంచి సుమారు 6లక్షల ఖాతాలను ఎంపిక చేశారు. ఈ ప్రారంభ పైలట్ సక్సెస్ అయితే మిగిలిన సుమారు 2.5 మిలియన్ ఇన్ యాక్టివ్ అకౌంట్లకు కూడా అదే ఆటోమేటెడ్ ప్రక్రియ అమలు చేయబడుతుంది.
నిలిచిపోయిన వేల కోట్ల ఫండ్స్ :
డేటాను పరిశీలిస్తే.. మొత్తం 31.86 లక్షల ఇన్ యాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. ఇందులో రూ. 10,903 కోట్లు ఉన్నాయి. అదే సమయంలో రూ. 1,000 వరకు చిన్న డిపాజిట్లు ఉన్న ఖాతాలు సుమారు 6 లక్షలు, మొత్తం రూ. 30.52 కోట్లు ఉన్నాయి. ఈ ఖాతాలు 3 నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించలేదు. దాంతో ఆయా పీఎఫ్ అకౌంట్లలో డబ్బులు అలానే ఉండిపోయాయి.
కార్మిక మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు నేరుగా ప్రయోజనం కలుగనుంది. గతంలో, ఉద్యోగాలు మారిన తర్వాత చాలామంది ఉద్యోగులు తమ పాత అకౌంట్లను మరిచిపోయేవారు. చిన్న మొత్తంలో ఫండ్స్ కోసం పీఎఫ్ ఆఫీసులకు డాక్యుమెంట్లతో ఏం తిరుగుతాంలేనని పట్టించుకోరు. ఈ కొత్త సిస్టమ్ ద్వారా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫండ్స్ ఈజీగా పొందవచ్చు.
