EVs in India
EVs in India: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో కార్లు, టూవీలర్లు గణనీయంగా అమ్ముడు పోతున్నాయి. కాగా, ఈ అమ్మకాలు తాజాగా ఓ మైలు రాయిని చేరుకున్నాయి. దేశంలో 10 లక్షల (ఒక మిలియన్) ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయినట్లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సంఘం (SMEV) ధృవీకరించింది. ఈరోజు వరకు పరిశ్రమ మొత్తం 1,152,021 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిందట. ఇందులో ఇ-బస్సులు, ఇ-కార్లు, ఇ-త్రీ-వీలర్లు, ఇ-టూ-వీలర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోని అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 58 శాతం పెరిగినట్లు ఎస్ఎంఈవీ పేర్కొంది.
Jio Studios : OTTకి ఎంట్రీ ఇచ్చిన జియో.. ఒకేసారి 100 స్టోరీస్ రిలీజ్.. జియో యూజర్స్‌కి పండగేనా?
దేశంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో 62 శాతం వాటా ద్విచక్ర వాహనాలదేనట. 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 726,976 ఇ-టూ-వీలర్లు విక్రయించారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో త్రీ-వీలర్లు రెండవ అతిపెద్ద వాటాను కలిగి ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 401,841 యూనిట్లు అమ్ముడు పోయాయి. మొత్తం ఎక్ట్రిక్ వాహనాల వాటాలో ఇది 34 శాతం. ఇక ఎలక్ట్రిక్ బస్సులు కేవలం 1,904 యూనిట్ల అమ్మకాలతో కేవలం 0.16 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి.
Rajasthan : రూ.30లకే 10 పూరీలు .. దంపతుల పెద్ద మనస్సుకు హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు
స్థానికీకరణ అర్హతను పాటించలేకపోయిన కంపెనీలకు FAME2 సబ్సిడీలను నిలిపివేయడంపై ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. సబ్సిడీని నిలిపివేయడం వల్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. పరిశ్రమ అర్హత ప్రమాణాలను రెండేళ్లపాటు పొడిగించాలని, దానితో పాటు FAME పథకాన్ని మరో 3-4 సంవత్సరాలు పొడిగించాలని కోరుతూ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎస్ఎంఈవీ పేర్కొంది.