Rajasthan : రూ.30లకే 10 పూరీలు .. దంపతుల పెద్ద మనస్సుకు హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు
నామమాత్రపు ధరకే పేదల కడుపు నింపుతున్న దంపతుల స్ట్రీట్ ఫుడ్ స్టాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jaipur Couple Sells 10 Puris Just Rs 30
Rajasthan : 10 Puris Just Rs 30 : ఈరోజుల్లో ఆహారం వ్యాపారంగా మారిపోయింది. కష్టమర్లను ఆకట్టుకోవటానికి వ్యాపారాలు ఆఫర్లు ప్రకటిస్తుంటారు. రుచి పేరుతో, ఆరోగ్యం పేరుతో ప్రకటనలు ఇస్తు ఆఫర్లతో కూడా ఆకట్టుకుంటుంటారు. కానీ రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన భార్యాభర్తలు తమకు లాభాలు కంటే ఆహారం పెట్టి కడుపు నింపటమే పనిగా పెట్టుకున్నారు. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తూ సేవే పరమావధిగా నామమాత్రపు ధరకే పూరీలు అమ్ముతున్నారు. కేవలం రూ.30లకే 10పూరీలు కూర కూడా అందిస్తు సేవే పరమావధిగా పనిచేస్తున్నారు. సంపాదన కంటే సేవ చేయటమే గొప్పగా భావిస్తున్నారు.
అలా రూ.30లకే 10పూరీలు కూర, రైతా కూడా అందిస్తున్నారు. భార్యాభర్తలిద్దరు జైపూర్ లో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ నడుపుతు పూరీ సబ్జీని నామమాత్రపు ధరకే అమ్ముతున్నారు. రూ.30లకే 10 పూరీలు సబ్జీ ప్లేట్ అందిస్తున్నారు. అలాగే గిన్నె రైతాతో కలిపి కేవలం రూ.10రూపాయలకే భోజనం కూడా పెడుతున్నారు.
intelligent elephant : అరటిపండు తొక్క వొలిచి తింటున్న ఏనుగు వీడియో వైరల్
ఈ భార్యాభర్తల సజ్జీపూరీల వ్యాపారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దంపతులు ఇద్దరు ఉదయం 7.30గంటల నుంచి మధ్యాహ్నాం 2గంటల వరకు ఆలూ సబ్జీ అమ్ముతారు. ఆలూ సబ్జీ లేదా చోలే ఇలా ఎవరికి నచ్చింది వారు ఎంపిక చేసుకుని కేవలం రూ.30లకే కడుపు నింపుతున్నారు. అలాగే పూరీలకు కాంబీనేషన్ గా చోలే కూర, టమోటా చట్నీ,వెల్లుల్లని చట్నీతో ఎవరికి నచ్చింది వారు తినేలా రుచిగా అందిస్తున్నారు.
కష్టమర్ కు పూరీలు వేడి వేడిగా అప్పటికప్పుడే వేసి అందిస్తారు. వారి స్టాల్ వద్ద కష్టమర్లు భోజనం కోసం భారీగా వస్తుంటారు. వారికి వేడి వేడిగా తాజాగా భోజనం అందించటమే కాకుండా ఇది వేసుకోండి అది వేసుకోండి అంటూ ఎంతో ప్రేమతో వడ్డిస్తున్నారీ దంపతులు. ‘Foodies.aao’ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన జైపూర్ దంపతుల స్ట్రీట్ ఫుడ్ వీడియో వీడియోకు 926 వేల వ్యూస్ రాగా..5వేల లైక్స్ వచ్చాయి.