Woman walked on the river : నర్మదా నదిపై నడుచుకుంటూ వెళ్లిన వృద్ధురాలు .. దేవత అంటూ ప్రచారం.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో ఓ పెద్దావిడ నదిపై నడిచేసింది. జనం తండోపతండాలుగా ఈ వింత చూడటానికి వచ్చేసారు. కట్ చేస్తే ఏం జరిగిందో.. మీరే చదవండి.

Woman walked on the river : నర్మదా నదిపై నడుచుకుంటూ వెళ్లిన వృద్ధురాలు .. దేవత అంటూ ప్రచారం.. వీడియో వైరల్

Woman walked on the river

Woman walked on the river :  రీసెంట్ గా ఓ యువకుడు నదిపై బైక్ నడిపి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు అలాంటిదో మరో వార్త. నదిపై ఓ వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్లడం వైరల్ గా మారింది. ఆమెను చూసిన జనం దేవతగా భావించి నది దగ్గర క్యూ కట్టారు. ఆ తరువాత అసలు నిజం తెలిసింది.

intelligent elephant : అరటిపండు తొక్క వొలిచి తింటున్న ఏనుగు వీడియో వైరల్

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్‌పూర్‌లోని (Jabalpur) నర్మదానది (Narmada River) తిల్వారా ఘాట్ (Tilwara Ghat) వద్ద ఓ పెద్దావిడ నడుచుకుంటూ వెళ్లడం జనం కంటపడింది. ఇంకేముంది జనం ఆమెను చూసేందుకు పరుగులు తీశారు. సాక్షాత్తు నర్మదా దేవి నదిపై నడుచుకుంటూ వెళ్తోందని ప్రచారం చేసారు. ఈ వార్త కాస్త పోలీసులకు చేరింది. ఇంతకీ జ్యోతి అనే ఈ వృద్ధురాలు నర్మదా నదికి ప్రదక్షిణలు చేసేందుకు నదిలోకి దిగిందట. నీటిమట్టం తక్కువగా ఉన్న ప్రాంతంలో ఆమె ప్రదక్షిణలు మొదలుపెట్టింది. ఇదంతా చూసిన జనం ఆమెను దేవతగా ప్రచారం చేశారు. నదిలోంచి బయటకు వచ్చి విషయం చెప్పడంతో వాస్తవం తెలిసింది. ఇక వృద్ధురాలిని చూడటానికి వచ్చిన జన సందోహంలోంచి ఆమెను ఇంటికి చేర్చేవరకు పోలీసులకు తిప్పలు తప్పలేదు.

Viral Video : ప్రాణాలకు తెగించే సాహసం.. నదిపై బైక్ నడిపిన వ్యక్తి వీడియో వైరల్

ట్విట్టర్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జనం మూఢనమ్మకాలు ఇంకా పోలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు కావాలని వీడియోలు వైరల్ చేస్తుంటే పాపం ఏదో నదికి ప్రదక్షిణలు చేద్దామని వచ్చిన బామ్మ కాస్త ఇలా వైరల్ అయిపోయింది.