Nitin Gadkari: నేను మధ్యతరగతి వాడిని, మీ కారు కొనలేను.. బెంజ్ కార్లను ఉద్దేశించి గడ్కరీ ఈసక్తికర వ్యాఖ్యలు

కొద్ది రోజుల క్రితమే మెర్సిడెజ్ బెంజ్ ఇండియా యూనిట్‭ను పూణెలోని చకస్ ప్రాంతంలో నెలకొల్పారు. కాగా, ఈ యూనిట్‭లో అసెంబుల్ అయిన మొట్టమొదటి దేశీయ బెంజ్ కారు ఈక్యూఎస్ 580మాటిక్ ఈవీని శుక్రవారం ఆవిష్కరించారు. దీనికి కేంద్ర మంత్రి గడ్కరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Nitin Gadkari: కారుపై ఆసక్తి ఉన్నవారికి మెర్సిడెజ్ బెంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెంజ్ విడుదల చేసే లగ్జరీ కార్ల కార్ల ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కానీ, ఆ కారును సొంతం చేసుకోవాలంటేనే కష్టం. భారతీయ సమాజంలో మధ్య తరగతి, పేదలే ఎక్కువగా ఉంటారు. దీంతో చాలా మందికి బెంజ్ కారు అనేది కలల కారుగానే మిగిలిపోతుంది. ఇది సగటు భారతీయుడి ఆవేదన. అయితే బెంజ్ కారు కొనే స్తోమత తనకు కూడా లేదని, తాను మధ్య తరగతి వాడినని, అందుకే ఆ కారును కొనలేదంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన స్థాయి గురించి కాదు కానీ, భారతదేశంలోని ప్రజల ఆర్థిక పరిస్థితులను ఉద్దేశించి ఆయనలా సరదాగా వ్యాఖ్యానించారు. ఇక విషయం ఏంటంటే.. కొద్ది రోజుల క్రితమే మెర్సిడెజ్ బెంజ్ ఇండియా యూనిట్‭ను పూణెలోని చకస్ ప్రాంతంలో నెలకొల్పారు. కాగా, ఈ యూనిట్‭లో అసెంబుల్ అయిన మొట్టమొదటి దేశీయ బెంజ్ కారు ఈక్యూఎస్ 580మాటిక్ ఈవీని శుక్రవారం ఆవిష్కరించారు. దీనికి కేంద్ర మంత్రి గడ్కరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉత్పత్తిని పెంచితే కార్ల ధర తగ్గుతుందని, ధర తగ్గితే ఎక్కువ కార్లు అమ్ముడుపోతాయని అన్నారు. ఇదే సందర్భంలో ఆయన కాస్త సరదాగా మాట్లాడుతూ ‘‘మేమంతా మధ్య తరగతి వాళ్లం. ఈ కారును నేను కూడా కొనలేను’’ అని దిగుమతి చేసుకుంటున్న బెంజ్ కార్లను ఉద్దేశించి అన్నారు. ఇక దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్ పెరుగుతోందని, దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. కాగా, తాజాగా విడుదల చేసిన ఈ కారు ధర 1.55 కోట్ల రూపాయలుగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రకటించింది.

Pak Airlines: లో-దుస్తులపై నిర్ణయం.. స్వదేశంలోనే పరువు తీసుకున్న పాకిస్తాన్ ఎయిర్‭లైన్స్

ట్రెండింగ్ వార్తలు