Ayushman Bharat Scheme : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు ఆరోగ్య బీమా..

Ayushman Bharat Scheme : ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కవరేజీని అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Everyone Over 70 To Be Covered Under Health Insurance Scheme

Ayushman Bharat Health Insurance Scheme : దేశంలో ప్రధానంగా 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. జాతీయ బీమా పథకం ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కవరేజీని అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ధి :
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) ద్వారా 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉన్న 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఒక ప్రకటనలో తెలిపింది. ఉచిత కవర్ విలువ రూ. 5 లక్షలు, కుటుంబ ప్రాతిపదికన అందించనుంది. ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. మానవతా దృష్టిలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొంది. ఇప్పటికే వేర్వేరు పథకాల్లో రిజిస్టర్ అయిన వృద్ధులు సైతం ఆయుష్మాన్ భారత్‌లో లబ్ధి పొందొచ్చు.

Read Also : iPhone 16 Price Comparison : ఐఫోన్ 16 కొంటున్నారా? భారత్‌ కన్నా విదేశాల్లోనే ధర చాలా తక్కువ తెలుసా? ఎంతంటే?

“ఈ ఆమోదంతో వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లందరూ ఏబీ పీఎమ్-జేఏవై ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. అర్హులైన సీనియర్ సిటిజన్‌లు ఏబీ పీఎమ్ జేఏవై కింద కొత్త ప్రత్యేకమైన కార్డ్‌ని జారీ చేస్తారు’’ అని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఏడాదికి వృద్ధులకు రూ. 5 లక్షల వరకు కవరేజీ :
ఇప్పటికే ఏబీ పీఎమ్-జేఏవై కింద కవర్ అయ్యే కుటుంబాలకు చెందిన 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లు తమకు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు అదనపు టాప్-అప్ కవర్‌ను పొందుతారు (70 ఏళ్ల లోపు వారు.. దీనిని తమ కుటుంబంలోని ఇతర సభ్యులతో షేర్ చేయాల్సిన అవసరం లేదు) అని కేంద్రం తెలిపింది.

సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS), ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల ప్రయోజనాలను ఇప్పటికే పొందుతున్న 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లు తమ ప్రస్తుత పథకాన్ని ఎంచుకోవచ్చు. లేదంటే ఏబీ పీఎమ్ జేఏవై హెల్త్ ఇన్యూరెన్స్ స్కీమ్ ఎంచుకోండి. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లేదా ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఉన్న 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లు ఏబీ పీఎమ్-జేఏవై కింద ప్రయోజనాలను పొందేందుకు అర్హులు.

ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పథకం :
ఏబీ పీఎమ్-జేఏవై అనేది 12.34 కోట్ల కుటుంబాలకు అనుగుణంగా 55 కోట్ల మందికి ద్వితీయ, తృతీయ సంరక్షణగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను అందించే ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్‌గా నిధులు సమకూర్చే ఆరోగ్య హామీ పథకం. ఇది వయస్సుతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబాలలోని సభ్యులందరూ పథకం కింద కవరేజీలోకి వస్తారు. ఈ పథకం 49 శాతం మంది మహిళా లబ్ధిదారులతో సహా 7.37 కోట్ల మందికి బీమా అందించింది. ఈ పథకం కింద దేశ ప్రజలు రూ. 1 లక్ష కోట్లకు పైగా ప్రయోజనం పొందారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఆరోగ్య బీమాను ప్రకటించిన పీఎం మోదీ :
70ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా విస్తరణను ఏప్రిల్‌లో ప్రధాని మోదీ ప్రకటించారు. ఏబీ పీఎమ్ జేఏవై స్కీమ్ లబ్ధిదారుల బేస్ కవరేజీని విస్తరించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రారంభంలో భారత జనాభాలో దిగువన ఉన్న 40 శాతం మందిని కలిగిన 10.74 కోట్ల పేద, బలహీన కుటుంబాలు ఈ స్కీమ్ కింద కవరేజీలో వచ్చారు. ఆ తరువాత, కేంద్రం జనవరి 2022లో ఏబీ పీఎమ్-జేఏవై కింద లబ్ధిదారుల స్థావరాన్ని 10.74 కోట్ల నుంచి 12 కోట్ల కుటుంబాలకు సవరించింది. భారత్ దశాబ్ద జనాభా పెరుగుదల 2011 జనాభా కన్నా 11.7 శాతంగా నమోదైంది.

దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 37 లక్షల మంది ఆశాలు/ఏడబ్ల్యూడబ్ల్యూలు/ఏడబ్ల్యూహెచ్‌లు, వారి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య ప్రయోజనాల కోసం పథకం మరింత విస్తరించింది. ఈ మిషన్‌ను ముందుకు తీసుకువెళ్లి (AB PM-JAY) ఇప్పుడు దేశవ్యాప్తంగా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పౌరులందరికీ రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాను అందిస్తుంది.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే :
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ న్యూఢిల్లీలో సమావేశమైంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వివరించారు.

గ్రామ్ సడక్ యోజన కోసం రూ. 70,125 కోట్లు :
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం-4కి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కోసం 70,125 కోట్ల కేటాయించింది. గ్రామీణ ప్రాంతాలు, రిమోట్ ఏరియాల్లో రోడ్ల నిర్మాణం కోసం నిర్ణయం తీసుకుంది. రానున్న ఐదేళ్లలో రూ 25 వేల కోట్లతో గ్రామీణ రహదారుల కోసం ఖర్చు చేయనునుంది. ఇప్పటివరకు రోడ్డు సదుపాయం లేని గ్రామాలు, మారుమూల పల్లెటూర్లకు రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. దేశవ్యాప్తంగా జల విద్యుత్తు ప్రాజెక్టులకు రూ 12,461 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం భారీగా నిధులు :
హైడ్రో పవర్ కోసం రూ. 12,471 కోట్లను కేటాయించింది. 31,359 మేగావాట్ల పవర్ టార్గెట్ పెట్టుకోగా.. పీఎం ఈ డ్రైవ్ కోసం రూ. 10,900 కోట్లను కేటాయించింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. టూవీలర్లు త్రీ వీలర్లు అంబులెన్స్లు ట్రక్కుల కోసం నిధులు కేటాయించింది. 88,500 ప్రదేశాల్లో చార్జింగ్ ఏర్పాటు చేయనుంది. పీఎం ఈ బస్, పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం కోసం రూ. 3,435 కోట్లు కేటాయించింది.

హై పర్ఫామెన్స్ కంప్యూటర్ల వినియోగం :
వాతావరణ శాఖకు మరింత టెక్నాలజీ అందించడం, నెక్స్ట్ జనరేషన్ రాడార్స్ శాటిలైట్లను ఉపయోగించడం కోసం మిషన్ మౌసమ్ (వాతావరణం) కోసం రూ.2వేల కోట్లు కేటాయించింది. హై పర్ఫామెన్స్ కంప్యూటర్లను కూడా వినియోగించనుంది.

Read Also : Aadhaar Card Free Update : ఆధార్ కార్డ్ ఫ్రీ అప్‌డేట్.. ఈ నెల 14 వరకే ఛాన్స్.. వెంటనే అప్‌‌డేట్ చేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు