Facebook: ఫేస్‌బుక్‌కి రూ.1500కోట్ల జరిమానా.. ఎందుకంటే?

అమెరికాలో ఎఫ్‌టీసీ గుత్తాధిపత్యానికి సంబంధించి ఫేస్‌బుక్‌పై కేసు పెట్టగా.. ఆ తర్వాత యూజర్లు బాగా తగ్గిపోయారు.

Facebook Meta

Facebook: అమెరికాలో ఎఫ్‌టీసీ గుత్తాధిపత్యానికి సంబంధించి ఫేస్‌బుక్‌పై కేసు పెట్టగా.. ఆ తర్వాత యూజర్లు బాగా తగ్గిపోయారు. ఇందుకు సంబంధించిన వార్తలు రాగా.. ఇప్పుడు ఆ కంపెనీకి మరో నిరాశ కలిగించే వార్త బ్రిటన్ నుంచి వచ్చింది. ఫేస్‌బుక్ కంపెనీ మెటాకు 150 మిలియన్ పౌండ్లు(రూ.1515కోట్లు) జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది బ్రిటన్ ప్రభుత్వం.

అంతేకాదు.. ప్లాట్‌ఫారమ్‌లలో ఒకదానిని విక్రయించాలని Metaని ఆదేశించింది అక్కడి ప్రభుత్వం. మెటా యానిమేటెడ్ ఇమేజ్ ప్లాట్‌ఫారమ్ Giphyని మే 2020లో 400 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసింది ఆ సంస్థ. మెటా తన డిజిటల్ ప్రకటనలపై ఈ డీల్ ప్రభావం గురించి చెప్పలేదు.

ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన బ్రిటన్‌కు చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎంఏ) మెటాపై 150 మిలియన్ పౌండ్ల జరిమానా విధించింది. అంతేకాదు Giphyని అమలు చేయడానికి మెటా అన్ని అవసరాలను తీర్చట్లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ ప్లాట్‌ఫారమ్‌ను విక్రయించాలని అధికార యంత్రాంగం ఆదేశించింది.

బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై మెటా కంపెనీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది సరైన నిర్ణయం కాదని కంపెనీ పేర్కొంది. మెటాపై CMA ద్వారా ఇటువంటి చర్య తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. మెటాపై ఇప్పటికే అధికార యంత్రాంగం జరిమానా విధించింది. అక్టోబర్ 2021లో, అక్కడి ప్రభుత్వం Facebookపై సుమారు 50.5 మిలియన్ల యూరోల జరిమానా విధించింది. గతవారం కంపెనీకి సరిగ్గా లేదు.. వినియోగదారులు కూడా పెద్ద సంఖ్యలో తగ్గారు.