మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉందా? కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పుడే కొనేసుకోని ఇంట్లో పెట్టుకోండి. చలికాలం కదా? చల్లబడకండి.. కొత్త రూల్ వస్తోంది. త్వరలో రిఫ్రిజిరేటర్ ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి. వచ్చే జనవరి (2020) నుంచి కొత్త శక్తి సామర్థ్య నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. సాధారణంగా మార్కెట్లో 5 స్టార్ రిఫ్రిజిరేటర్లకు భారీ గిరాకీ ఉంటుంది. కొనుగోలుదారులు ఈ మోడల్ ఫ్రీజులే కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
ఫైవ్ స్టార్ రిఫ్రిజిరేటర్ల ఖరీదు రూ.6వేలు పైనా పెంచనున్నట్టు (కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అపైలెన్సెస్ మ్యానిఫాక్చరర్స్ అసోసియేషన్) CEAMA ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త లేబులింగ్ మార్గదర్శకాలను తయారీ కంపెనీలకు తప్పనిసరి చేసేలా నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. ఫైవ్ స్టార్ రిఫ్రిజిరేటర్లలో వాక్యూమ్ ప్యానెల్ నుంచి సాంప్రదాయక ఫోమ్స్ మాదిరిగా మార్చనున్నట్టు సీఈఎంఎ తెలిపింది. రిఫ్రిజిరేటర్ పరిశ్రమలకు ఇదొక సవాల్ గా మారినట్టు పేర్కొంది.
కంప్రెసర్ ఆధారిత ప్రొడక్టుల్లో రూమ్ ఎయిర్ కండీషనర్స్ (RAC) రిఫ్రిజిరేటర్లు, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) వంటి స్టార్ రేటింగ్ లేబుల్ ప్రొడక్టులపై జనవరి 2020 నుంచి ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. ఫ్రాస్ట్ ఫ్రీ, డైరెక్ట్ కూలింగ్ రిఫ్రిజిరేటర్లన్నీ ఒక స్టార్ రిఫ్రిజిరేటర్లుగా మారనున్నాయి.
ఈ మార్పుతో ఫైవ్ స్టార్ లేబుల్ రిఫ్రిజిరేటర్ల తయారీపై పరిశ్రమలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ ఇదే మోడల్ రిఫ్రిజిరేటర్లపై కనీసం రూ.5వేల నుంచి రూ.6వేల వరకు ధర భారీగా పెరగనుంది. ఎందుకుంటే.. వీటిలో వాక్యుమ్ ప్యానెల్ అమర్చడం ద్వారా 5 స్టార్ రిఫ్రిజిరేటర్ గా మార్చేయడమే ఇందుకు కారణమని CEAMA అధ్యక్షులు కమల్ నాండీ స్పష్టం చేశారు.
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ సిగ్మెంట్ రిఫ్రిజిరేటర్లు 12శాతం నుంచి 13 శాతానికి పెరిగాయి. వీటిలో ఏసీ, వాషింగ్ మిషన్లే భారీగా ఉన్నట్టు ఆయన చెప్పారు. ఇక టీవీ సిగ్మెంట్లలో ఒక ఆన్ లైన్ ఛానల్ వృద్ధిని చూస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో కొన్ని కొత్త చిన్న బ్రాండ్లు అద్భుతమైన లాభాలను గడించాయన్నారు.
2017-18 ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఫ్లాట్ గ్రోత్ వస్తే.. కొన్ని సిగ్మెంట్లలో మాత్రం వృద్ధి క్షీణించిందని నాండీ చెప్పారు. ఇక ఈ ఏడాదిలో ఆరంభంలో ఏసీ సిగ్మెంట్ మంచి వృద్ధిని సాధించింది. మరోవైపు ACలపై విధించే జీఎస్టీని కూడా తగ్గించాలని, 18శాతానికి తక్కువ తీసుకురావాలని ప్రభుత్వాన్ని అసొసియేషన్ కోరినట్టు ఆయన తెలిపారు.