Vivo T4x 5G : అబ్బా.. భలే డిస్కౌంట్.. రూ. 21వేల వివో 5G ఫోన్ కేవలం రూ. 15వేలు లోపే.. ఇలా కొన్నారంటే?

Vivo T4x 5G : కొత్త వివో T4 5G ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 21వేల వివో 5G ఫోన్ కేవలం రూ. 15వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు.

Vivo T4x 5G

Vivo T4x 5G Discount : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాత్ సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. పవర్‌ఫుల్ బ్యాటరీ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే సరైన సమయం. అతి తక్కువ ధరకే మీకు నచ్చిన వివో 5G ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ధర ఎక్కువగా ఉంటుందని ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

Read Also : PF Withdrawals : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ PF డబ్బులను రూ. 5లక్షల వరకు విత్‌డ్రా చేయొచ్చు.. ఫుల్ డిటెయిల్స్..!

ఎందుకంటే.. రూ. 21వేల విలువైన వివో T4 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌ను కేవలం 15వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను బిగ్ బజాత్ డేస్ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సరసమైన ఫోన్ ఇంకా తక్కువ ధరలో ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వివో T4x 5G ధర, లభ్యత :
వాస్తవానికి, వివో T4x 5G ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999కు లాంచ్ అయింది. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో 19శాతం తగ్గింపుతో పొందవచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత వివో ఫోన్ ధర రూ. 16,999గానే ఉంటుంది. అయితే, బ్యాంక్ ఆఫర్ కింద ఈ 5G ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు.

అన్ని బ్యాంక్ కార్డులపై రూ. 650 డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. అలాగే, అన్ని క్రెడిట్ కార్డులపై రూ. 600 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అలాగే, మీరు రూ.16,100 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. కానీ, అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లయ్ అవుతాయి గుర్తుంచుకోండి. మీరు ఈ వివో ఫోన్ రూ.833 నుంచి నెలవారీ ఈఎంఐతో కూడా కొనుగోలు చేయవచ్చు.

వివో T4x 5G స్పెసిఫికేషన్లు :
ఈ ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో కూడిన 6.72-అంగుళాల పెద్ద IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా (FuntouchOS 15)పై నడుస్తుంది. ఈ ఫోన్ 6GB (LPDDR4X) ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

Read Also : ChatGPT Ghibli : చాట్‌జీపీటీ ‘ఘిబ్లి’తో జాగ్రత్త.. ట్రెండ్ కోసం మీ ఫొటోలు తెగ అప్‌లోడ్ చేస్తున్నారా? మీ ప్రైవసీ హ్యాకర్ల చేతుల్లోకి..!

కెమెరా, బ్యాటరీ :
కెమెరా, వీడియో క్వాలిటీ పరంగా, హ్యాండ్‌సెట్‌లో 50MP మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 2MP అల్ట్రా-వైడ్ కెమెరా, 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ఫోన్ 6500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్ 2 ఏళ్ల OS అప్‌డేట్‌లు, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో వస్తుంది.