Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ సేల్ ఆఫర్లు.. స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

Flipkart Big Billion Days Sale : పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ వచ్చే నెల అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ-కామర్స్ సైట్‌లో 'ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్'ను ప్రారంభించనుంది. ఈ సేల్ సమయంలో టీవీలు, రిఫ్రిజిరేటర్లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి.

  • Published on- September 24, 2026 / 07:28 PM IST

Flipkart Big Billion Days Sale

  • బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్‌టీవీలు రూ. 4,999 నుంచి ప్రారంభం
  • ఫ్లిప్‌కార్ట్‌లో రిఫ్రిజిరేటర్లు రూ. 6,990 ప్రారంభ ధరతో లభ్యం
  • ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 8న ప్రారంభం

Flipkart Big Billion Days Sale : పండుగ సీజన్‌ వచ్చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ వచ్చే నెల అక్టోబర్ 9వ తేదీ నుంచి ‘ది బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఫస్ట్ టైమ్ షాపింగ్ చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ సేల్ ప్రారంభం కాకముందే ఇ-కామర్స్ సైట్ ‘ఎర్లీ బర్డ్ డీల్స్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్‌లో ప్రత్యేకంగా (Flipkart Big Billion Days Sale) యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో చేసే పేమెంట్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ సేల్ వివరాలు, మరెన్నో ఆఫర్లను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరింత ఆదా :
ఈ-కామర్స్ సైట్‌లో సేల్ సమయంలో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చేసే పేమెంట్లపై 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కస్టమర్లు 10 శాతం ఆదా చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ సూపర్ మనీ ద్వారా ఫస్ట్ పేమెంట్‌పై 10 శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. భీమ్, క్రెడ్, పేటీఎం, యూపీఐ ద్వారా చేసే పేమెంట్లపై కూడా మరింత ఆదా లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బోల్ట్ ఈవీఓ ధర రూ. 8,999 నుంచి ప్రారంభమవుతుంది. ఏసర్ స్విఫ్ట్ నియో ఏఐ పీసీల ధర రూ. 54,990 నుంచి ప్రారంభమవుతుంది. సౌండ్‌బార్ల ధర రూ. 849 నుంచి ప్రారంభమవుతుంది. గోబౌల్ట్ స్మార్ట్ ధర రూ. 1,199 నుంచి ప్రారంభమవుతుంది.

Read Also : iPhone Air Price : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ. 30వేలు డిస్కౌంట్.. అమెజాన్‌లో ధర ఎంతంటే?

హైసెన్స్ 65 క్యూఎల్‌ఈడీ ధర రూ. 39,999 నుంచి మొదలవుతుంది. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల ధర రూ. 10,990 నుంచి ప్రారంభమవుతుంది. రిఫ్రిజిరేటర్ల ధర రూ. 6,990 నుంచి ప్రారంభమవుతుంది. అత్యధికంగా అమ్ముడవుతున్న టీవీల ధర రూ. 7,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ :
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ సందర్భంగా మొబైల్స్‌పై డీల్స్, ఒప్పో కె14 5జీ ధర రూ. 15,999 నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా నోవా 2 పవర్ 5జీ ధర రూ. 16,999 నుంచి ప్రారంభమవుతుంది. శాంసంగ్ గెలాక్సీ F07 4జీ ఫోన్ రూ. 11,999 ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. నోవా 2 అల్ట్రా 5జీ ధర రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది. నోవా 2 పవర్ 5జీ ఫోన్ రూ. 15,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ధర రూ. 23,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రియల్‌మి P4ఎస్ 5జీ ఫోన్ రూ. 31,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. దీపావళి సేల్‌లో రియల్‌మి P4 5జీ ఫోన్ రూ. 29,999కి అందుబాటులో ఉంటుంది. టీవీ డీల్స్ రూ. 4,999 నుంచి ప్రారంభమవుతాయి. రియల్‌మి టెక్‌లైఫ్ టీవీల ధర రూ. 10,299 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో మోటోరోలా టీవీల ధర రూ. 12,299 నుంచి ప్రారంభమవుతుంది.