Binny Bansal Resign : ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం.. బోర్డు నుంచి బిన్నీ బన్సాల్ రాజీనామా.. ఆయన గురించి 5 వాస్తవాలివే..!

Binny Bansal Resign : ఈ కామర్స్ దిగ్గజం సహ-వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఫ్లిప్‌కార్ట్‌కు గుడ్ బై చెప్పేశారు. అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన బన్సాల్ గురించి తెలిసిన 5 విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Flipkart Co-Founder Binny Bansal Resigns From Board_ 5 Facts About Him

Binny Bansal Resign from Flipkart Board : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ బోర్డు నుంచి అధికారికంగా తప్పుకున్నారు. ఈ  మేరకు ఇ-కామర్స్ దిగ్గజం బోర్డు నుంచి ఆయన రాజీనామా చేశారు.

16 ఏళ్ల క్రితం సచిన్ బన్సాల్‌తో కలిసి ప్రారంభించిన ఈ అధ్యాయానికి బిన్నీ బన్సాల్ ముగింపు పలికారు. ఫ్లిప్‌కార్ట్‌లో బన్సల్ తన మిగిలిన వాటాను ఇటీవల విక్రయించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. గత 16 సంవత్సరాలలో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సాధించిన విజయాల పట్ల తాను గర్వపడుతున్నానని బన్సాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also : Top 5 Best Tablets in 2024 : రూ. 20వేల నుంచి రూ.30వేల ధరలో టాప్ 5 బెస్ట్ టాబ్లెట్స్ మీకోసం.. ఏ ట్యాబ్ ధర ఎంతంటే? 

ఫ్లిప్‌కార్ట్ బలమైన నాయకత్వ బృందంతో బలమైన స్థానంలో నిలిచిందన్నారు. ఈ విశ్వాసంతోనే తాను బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కంపెనీ సమర్థుల చేతుల్లో ఉందని తెలుసుకునే తాను పక్కకు తప్పుకోవాలని భావించినట్టు బన్సాల్ తెలిపారు. కస్టమర్‌లకు మెరుగైన అనుభవాలను అందించడం ఇలానే కొనసాగిస్తుందని కోరుకుంటున్నానని చెప్పారు. తాను బోర్డు నుంచి తప్పుకున్నప్పటికీ కూడా కంపెనీ వ్యాపారానికి బలమైన మద్దతుదారుగా ఉంటానని బిన్నీ బన్సాల్ స్పష్టం చేశారు.

Flipkart Co-Founder Binny Bansal Resigns From Board_ 5 Facts About Him

బిన్నీ బన్సాల్ జర్నీ ఎలా మొదలైందంటే? కొన్ని వాస్తవాలివే :

  • చండీగఢ్‌కు చెందిన బిన్నీ బన్సాల్ నగరంలోని సెయింట్ ఆన్స్ కాన్వెంట్ స్కూల్‌లో చదువుకున్నాడు.
  • ఐఐటీ ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌ను అభ్యసించాడు. చివరికి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.
  • కాలేజీ తర్వాత సర్నాఫ్ కార్పొరేషన్‌లో పనిచేశాడు.
  • జనవరి 2007లో అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాడు. అక్కడ అతను 9 నెలలు పనిచేశాడు.
  • చివరికి అమెజాన్‌ను విడిచిపెట్టి ఫ్లిప్‌కార్ట్‌కు సహ వ్యవస్థాపకుడు అయ్యాడు.
  • ఫ్లిప్‌కార్ట్‌లో బిన్నీ బన్సాల్ కీలక పదవుల్లో కొనసాగాడు.
  • చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌, ఆ తరువాత 2016లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యాడు.
  • జనవరి 2017లో గ్రూప్ సీఈఓ అయ్యాడు.
  • స్టార్టప్‌లలో పెట్టుబడులకు పేరుగాంచిన బన్సల్ డిజిటల్ పేమెంట్ల సంస్థ (PhonePe) బోర్డులో కూడా ఉన్నారు.
  • బిన్నీ బన్సాల్ భారత మార్కెట్లో అతి పిన్న వయస్కులలో ఒకరు.
  • ప్రస్తుతం బన్సాల్ నికర విలువ 1.4 బిలియన్ డాలర్లు (రూ. 11,637 కోట్లు).

Read Also : Asus ROG Phone 8 Series Sale : విజయ్ సేల్స్‌లో అసూస్ ROG 8 సిరీస్ గేమింగ్ ఫోన్లపై సేల్.. దిమ్మతిరిగే ఫీచర్లు, ధర ఎంతంటే?