Flipkart Freedom Day Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్.. ఈ శాంసంగ్, ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?
Flipkart Freedom Day Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026 అతి త్వరలో ప్రారంభం కానుంది. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు లభించనున్నాయి.. ఈ క్రేజీ డీల్స్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- August 2, 2026 / 04:45 PM IST
Flipkart Freedom Day Sale 2026
- ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ ఆగస్టు 8న ప్రారంభం కానుంది
- అర్హులైన కస్టమర్లకు ఆగస్టు 7న ముందస్తు యాక్సెస్
- ఐఫోన్, శాంసంగ్, పిక్సెల్ ఫోన్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులోకి
- ఎంపిక చేసిన కొనుగోళ్లపై అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు
Flipkart Freedom Day Sale 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకునేవారికి అద్భుతమైన ఛాన్స్.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026 అతి త్వరలో రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో సహా అన్ని కేటగిరీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ ధరల పెంపుతో అనేక ఫ్లాగ్‌షిప్ మోడళ్లు ఇప్పుడు ఖరీదైనవిగా మారాయి. ఇప్పటికే పలు బ్రాండ్లు ధరలను భారీగా పెంచేశాయి.
తక్కువ ధరకే కొత్త ఫోన్ కొనాలని చూసేవారికి అద్భుతమైన ఛాన్స్.. ఈ సేల్ ప్రారంభం కాకముందే ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో, గెలాక్సీ S26 అల్ట్రా, గెలాక్సీ S26 ప్లస్, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ వంటి ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. రాబోయే ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026 ( Flipkart Freedom Day Sale 2026) సేల్ తేదీ, ఆఫర్లు, ధరలు మరిన్ని వివరాలపై ఓసారి లుక్కేయండి.
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026 డీల్స్ :
ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్ సేల్ ధరలను రిలీజ్ చేసింది. గూగుల్ పిక్సెల్ 10 ధర రూ. 62,999 కాగా, పిక్సెల్ 10a ధర రూ. 50,999గా నిర్ణయించారు. ఇంకా మెరుగైన ఫోన్ కోసం చూస్తున్న యూజర్ల కోసం గూగుల్ పిక్సెల్ 10 ప్రో ధర రూ. 99,999గా ఉంది. అత్యంత ఖరీదైన మోడల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ధర రూ. 1,14,999గా నిర్ణయించారు.
ఐఫోన్ 17 ధర సుమారుగా రూ. 7,900 నుంచి, ఐఫోన్ 17 ప్రో ధర సుమారు రూ. 1,2,900 నుంచి, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర సుమారు రూ. 1,3,900 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ ఎయిర్ ధర సుమారు రూ. 9,900, ఐఫోన్ 16 ధర సుమారు రూ. 6,900, ఐఫోన్ 15 ధర సుమారు రూ. 5,900గా ఉంది. బ్యాంకు ఆఫర్లను బట్టి మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మరింత తగ్గింపు పొందవచ్చు.
Read Also : Income Tax Return : ITR గడువు మిస్ అయ్యిందా? డోంట్ వర్రీ.. ఫస్ట్ టాక్స్ పేయర్లు చేయాల్సింది ఇదే!
ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ల సేల్ ధరలను కూడా ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ S25 ధర రూ. 59,999 కాగా, గెలాక్సీ S25 ఎఫ్ఈ ధర రూ. 49,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ధర రూ. 26,999, శాంసంగ్ గెలాక్సీ F70e 5జీ ధర రూ. 13,999గా ఉంది. కొత్త గెలాక్సీ S26 5జీ ధర రూ. 79,999 కాగా, శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ ధర రూ. 1,30,999గా ఉంది.
ఫోల్డబుల్ ఫోన్‌లను ఇష్టపడే వారు అయితే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 ధర రూ. 1,70,999గా ఉంది. చివరగా, శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్ ధర రూ. 36,499, శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ధర రూ. 51,499గా ఉంది. సేల్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని ఆఫర్లు ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026 తేదీలు :
దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు ఆగస్టు 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026 యాక్సస్ చేయొచ్చు. అయితే, మీరు ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్ లేదా ప్లస్ మెంబర్ లేదా ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మీకు ఆగస్టు 7 నుంచే ఈ సేల్‌కు అడ్వాన్స్ యాక్సెస్‌ను అందిస్తోంది.
బ్యాంక్, కార్డు ఆఫర్లు (అంచనా) :
ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఎంపిక చేసిన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే సేల్ సమయంలో అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్లు ఎంపిక చేసిన ప్రొడక్టులకు మాత్రమే వర్తిస్తాయి. కొన్ని షరతులు, నిబంధనలను కూడా చెక్ చేయడం బెటర్.
