Flipkart Freedom Sale : కొత్త ఫోన్ కావాలా? నో కాస్ట్ EMI ఆప్షన్‌తో వివో T4 5G ఫోన్.. వివో లవర్స్ డోంట్ మిస్..!

Flipkart Freedom Sale : వివో T4 5G ఫోన్ చౌకైన ధరకే లభిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఫ్లిప్ కార్ట్‌సేల్‌లో కొనుగోలు చేయొచ్చు.

Flipkart Freedom Sale

Flipkart Freedom Sale : వివో అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. కొత్త వివో ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. తక్కువ బడ్జెట్ ధరలో వివో 5G ఫోన్ (Flipkart Freedom Sale) సొంతం చేసుకోవచ్చు. మిడ్ బడ్జెట్ పరిధిలో సొంతం చేసుకోవచ్చు. వివో T4 5G ఫోన్‌ అతి తక్కువ ధరకే లభిస్తోంది.

32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ వెబ్‌సైట్ నుంచి తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. తద్వారా ఏకంగా రూ. 4వేలు సేవ్ చేసుకోవచ్చు. మరెన్నో అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్‌లు పొందవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

వివో T4 5Gపై సేల్ ఆఫర్లు :
ప్రస్తుతం 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అమ్మకానికి అందుబాటులో ఉంది. వివో T4 5G ధర రూ.27,999కు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి 14శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు తర్వాత ధర రూ.23,999 పొందవచ్చు.

Read Also : Motorola G85 : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. మోటోరోలా G85 భారీగా తగ్గిందోచ్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ రాదు భయ్యా..!

బ్యాంక్ ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 1500 తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పాత ఫోన్‌ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 23,300 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. అలాగే, రూ. 4వేలు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.

వివో T4 5G బెస్ట్ స్పెసిఫికేషన్లు (Flipkart Freedom Sale) :
డిస్‌ప్లే : 6.67-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌
పర్ఫార్మెన్స్ : మల్టీ టాస్కింగ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌, 5,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్
కెమెరా ఫీచర్లు : కెమెరా, వీడియో క్వాలిటీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌
50MP ప్రైమరీ కెమెరా, OIS సపోర్టు, 2MP సెకండరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 32MP కెమెరా
బ్యాటరీ : 7300mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌