Flipkart Republic Day Sale (Image Credit To Original Source)
Flipkart Republic Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో మీరు ఏ ప్రొడక్టు కొనాలన్నా భారీ తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు. ఎందుకంటే.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ వార్షిక సేల్ అన్ని కేటగిరీ ప్రొడక్టులపై అదిరిపోయే డిస్కౌంట్లను అందించనుంది.
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈవెంట్‌కు సంబంధించి స్పెషల్ మైక్రోసైట్‌ను కూడా పబ్లీష్ చేసింది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సబ్‌స్క్రైబర్‌లు సేల్‌కు ముందస్తు యాక్సెస్ పొందవచ్చు. సేల్ సమయంలో మీకు నచ్చిన ఫోన్ లేదా ఇతర ప్రొడక్టులను కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రాబోయే రిపబ్లిక్ డే సేల్ 2026కు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 తేదీ వివరాలివే :
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17న ప్రారంభమవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లేదా ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్‌షిప్స్ ఉన్న వారికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు కూడా మెంబర్‌షిప్ ఉంటే ఈ నెల 16 నుంచి 24 గంటల ముందుగానే సేల్ యాక్సెస్ చేయొచ్చు.
Flipkart Republic Day Sale (Image Credit To Original Source)
అంతేకాదు.. స్టాక్ అయిపోకముందే మీకు నచ్చిన ప్రొడక్టులను సొంతం చేసుకోవచ్చు. జనవరి 26న భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ సమయంలో అనేక ప్రొడక్టులపై అద్భుతమైన డిస్కౌంట్లను అందించనుంది.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ఆఫర్లు, డిస్కౌంట్లు :
ఈ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ వివిధ కేటగిరీ ప్రొడక్టులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈజీ ఈఎంఐ ఆప్షన్లతో పాటు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది.
ఈ సేల్‌లో రష్ అవర్ డీల్స్, టిక్ టాక్ డీల్స్, జాక్‌పాట్ డీల్స్, స్టీల్ డీల్స్ వంటి అనేక అద్భుతమైన ఆఫర్‌లు ఉండొచ్చు. ఈ సేల్ సమయంలో షాపింగ్ చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆదా చేసుకోవచ్చు.