Google Pixel 9 Sale : పిక్సెల్ లవర్స్‌కు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ధర భారీగా తగ్గిందోచ్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ జన్మలో రాదు..!

Google Pixel 9 : గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 సిరీస్ అతి తక్కువ ధరకే లభ్యమవుతుంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 12వేలు తగ్గింపు పొందవచ్చు.

Google Pixel 9

Google Pixel 9 Sale : మీరు గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. గూగుల్ పిక్సెల్ 9 ఫోన్‌ చౌకైన ధరకే కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ సేల్ సందర్భంగా ఈ పిక్సెల్ 9 ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ పిక్సెల్ ఫోన్‌పై కస్టమర్లు బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. 50MP కెమెరాతో వస్తుంది. మొత్తంమీద, ఈ పిక్సెల్ ఫోన్ ఫీచర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంతకీ ఈ డీల్స్, ఆఫర్ల ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Apple iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ.13వేలు డిస్కౌంట్.. ఇంత మంచి డీల్ మళ్లీ రాదు..!

గూగుల్ పిక్సెల్ 9 డిస్కౌంట్ ఆఫర్లు, ధర ఎంతంటే? :
గూగుల్ నుంచి ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ పిక్సెల్ 9 ఫోన్ ధర రూ.74,999 కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్లపై రూ.7వేలు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా పిక్సెల్ 9 ఫోన్ ధర రూ.67,999 అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ ధర ప్రకారం.. రూ.12 వేల వరకు చౌకగా లభిస్తోంది.

గూగుల్ పిక్సెల్ 9 స్పెసిఫికేషన్స్ :
గూగుల్ నుంచి వచ్చిన ఈ ఫోన్ 6.3-అంగుళాల యాక్టా OLED డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1,080×2,424 పిక్సెల్‌లుగా వస్తుంది. అదే సమయంలో, ఈ ఫోన్ 60Hz-20Hz రిఫ్రెష్ రేట్‌తో 2,700 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో టెన్సర్ G4 ప్రాసెసర్ ఉంది. అదే సమయంలో, ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌లో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది.

Read Also : Vivo V50e 5G Sale : కొత్త వివో ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో V50e 5G ప్రీ ఆర్డర్ సేల్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

కెమెరా ఫీచర్ల గురించి విషయానికి వస్తే.. ప్రైమరీ కెమెరా 50MP కలిగి ఉంది. అదే సమయంలో, సెకండరీ కెమెరా 48MP కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 10.5MP డ్యూయల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. పవర్ విషయానికొస్తే.. 4,700mAh బ్యాటరీని 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. Wi-Fi, బ్లూటూత్, NFC, GPS, USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంది.