×
Ad

Tatkal Ticket Booking : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇలా చేస్తేనే తత్కాల్ టికెట్లు బుకింగ్ అవుతాయి..!

Tatkal Ticket Booking : తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ మారబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి తత్కాల్ టికెట్లు ఓటీపీ వెరిఫికేషన్ లేకుండా పొందలేరు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published On : November 30, 2025 / 07:59 PM IST

Tatkal Ticket Booking Dec 1

Tatkal Ticket Booking : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి సరికొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ప్రత్యేకించి తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో కొత్త నిబంధనలు పాటించాల్సిందే.. లేదంటే మీరు తత్కాల్ టికెట్ బుకింగ్ చేయలేరు. భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని రూల్స్ (Tatkal Ticket Booking) మార్చబోతున్నాయి. పశ్చిమ రైల్వేబోర్డు తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో పెద్ద మార్పును ప్రకటించింది.

రైల్వే బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా టికెట్ బుకింగ్‌ను మరింత పారదర్శకంగా సురక్షితంగా ఉంచేందుకు ఈ కొత్త సిస్టమ్ తీసుకువస్తున్నాయి. రైల్వే అధికారుల ప్రకారం.. ప్రయాణీకుల మొబైల్ నంబర్‌కు పంపిన సిస్టమ్-జనరేటెడ్ వన్-టైమ్ (OTP) పాస్‌వర్డ్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే తత్కాల్ టిక్కెట్లు జారీ అవుతాయి. టికెట్ బుకింగ్ ప్రక్రియలో ఇప్పుడు OTP కన్ఫర్మేషన్ తప్పనిసరి. ఈ కొత్త రూల్స్ రైల్వే ప్రయాణీకులకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నారు.

రాంగ్ OTP వాడితే తత్కాల్ టిక్కెట్లు పొందలేరు :
కొత్త భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రయాణీకులు టికెట్ బుక్ చేసుకునే సమయంలో తమ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సిస్టమ్ OTPని జనరేట్ చేస్తుంది. ఆపై ఆ మొబైల్ నంబర్‌కు పంపుతుంది.

Read Also : SIP Calculator : డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా? SIPలో ఇలా ఇన్వెస్ట్ చేయండి.. జస్ట్ రూ. 20వేల జీతంతోనే మీరు లక్షాధికారి కావచ్చు..!

ఆ OTPతో వెరిఫై తర్వాతే తత్కాల్ టిక్కెట్లు కన్ఫార్మ్ అవుతాయి. OTP రాంగ్ లేదా వ్యాలిడ్ కాకుంటే టికెట్ జారీ కాదు. ఈ కొత్త సిస్టమ్ అన్ని రకాల తత్కాల్ బుకింగ్‌లకు వర్తిస్తుంది. ఇందులో కంప్యూటరైజ్డ్ PRS కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు, IRCTC వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా చేసిన రైల్వే బుకింగ్స్ ఉంటాయి.

ఎందుకు రూల్స్ మారాయంటే? :
భారతీయ రైల్వేల ప్రకారం.. తత్కాల్ టికెట్ బుకింగ్‌లలో గతంలో వ్యత్యాసాలు, మోసపూరిత పద్ధతులు ఉండేవి. బాట్స్, ఇతర టెక్నాలజీ విధానాలతో తత్కాల్ టిక్కెట్లు త్వరగా బుక్ అయ్యేవి. తద్వారా అసలైన ప్రయాణీకులకు అసౌకర్యం కలుగుతుంది. అందుకే OTP ఆధారిత వెరిఫికేషన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది.

ఈ సిస్టమ్ తత్కాల్ బుకింగ్ సమస్యలను తగ్గించగలదు. ఈ కొత్త సిస్టమ్ టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా సురక్షితంగా చేస్తుందని అధికారులు చెబుతున్నారు. వెరిఫైడ్ వివరాలు కలిగిన ప్రయాణీకులకు మాత్రమే తత్కాల్ టిక్కెట్లు అందుతాయి.